Items To Kids : చిన్నారుల‌కు వీటిని ఎట్టి ప‌రిస్థితిలోనూ ఇవ్వ‌రాదు.. ఎందుకంటే..?

Items To Kids : చిన్నారుల ఆరోగ్యం ప‌ట్ల త‌ల్లిదండ్రులు జాగ్ర‌త్త‌గా ఉండాలి. వారిని ఎల్ల‌ప్పుడూ గ‌మ‌నిస్తుండాలి. వారు చేతికి దొరికిన‌ద‌ల్లా నోట్లో పెట్టుకుంటుంటారు. అందువ‌ల్ల వారిపై ఓ క‌న్నేసి ఉంచాలి. అయితే కొన్ని ర‌కాల ఆహారాల‌ను మాత్రం చిన్నారుల‌కు ఇచ్చే విషయంలో జాగ్ర‌త్త వ‌హించాలి. లేదంటే అవి వారి గొంతులో ఇరుక్కుపోయి ఇబ్బందుల‌ను క‌లిగించేందుకు అవ‌కాశాలు ఉంటాయి.

చిన్నారుల‌కు పండ్ల‌ను ఇస్తే జ్యూస్ రూపంలో చేసి తాగించాలి. లేదా చాలా చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసి ఇవ్వాలి. అంతేకానీ పెద్ద ముక్కలుగా చేసి ఇవ్వ‌రాదు. అలా ఇస్తే అవి గొంతులో ఇరుక్కుని పోయేందుకు అవ‌కాశం ఉంటుంది.

Items To Kids do not give these to them
Items To Kids

ఇక పిల్ల‌ల‌కు చాకొలెట్లు, టాఫీలు, బిస్కెట్ల వంటివి కూడా పెద్ద‌వి ఇవ్వ‌రాలు. అవి కూడా గొంతులో ఇరుక్కుపోయేందుకు అవ‌కాశాలు ఉంటాయి. పాప్ కార్న్ కూడా ఇవ్వ‌రాదు. అవి పెద్ద‌గా ఉంటాయి. క‌నుక సుల‌భంగా ఇరుక్కుపోతాయి. ఇక బ‌ట‌న్స్‌, పెన్ క్యాప్‌లు, స్టేష‌న‌రీ వ‌స్తువులు, కాయిన్ల‌ను కూడా పిల్ల‌ల‌కు దూరంగా ఉంచాలి. లేదంటే ఇబ్బందుల్లో ప‌డిపోతారు.

Editor

Recent Posts