Tomato Rasam : హోట‌ల్స్ లో చేసే లాంటి రుచితో ట‌మాటా ర‌సాన్ని ఇంట్లోనే ఇలా త‌యారు చేసుకోవ‌చ్చు.. ఎలాగంటే..?

Tomato Rasam : భోజ‌నం అంటే అందులో ర‌క‌ర‌కాల కూర‌లు ఉంటాయి. శుభ కార్యాలు లేదా ఇతర కార్య‌క్ర‌మాల్లో అయితే వెరైటీ రుచుల‌తో కూర‌లు ఉంటాయి. క‌నుక వివిధ ర‌కాల వంట‌ల‌తో భోజ‌నం చేస్తారు. అలాగే ర‌సం కూడా ఉంటుంది. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. దీంతోపాటు హోట‌ల్స్‌లోనూ మీల్స్ తింటే ర‌సం ఇస్తారు. ఇది కూడా టేస్టీగా ఉంటుంది. అయితే హోట‌ల్స్ లాంటి రుచి వ‌చ్చేలా ట‌మాటా ర‌సాన్ని ఇంట్లోనే ఇలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇందుకు వంట రావాల్సిన ప‌నిలేదు. ఎవ‌రైనా స‌రే చేయ‌గ‌ల‌రు. ఈ క్ర‌మంలోనే ట‌మాటా ర‌సాన్ని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ట‌మాటా ర‌సం త‌యారీకి కావలసిన పదార్థాలు..

బాగా పండిన టమోటాలు – 5, నిమ్మకాయ సైజు చింతపండు, అరటేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఉల్లిపాయ – 1, వెల్లుల్లి రెబ్బ‌లు – 4, జీలకర్ర – అర టీస్పూన్‌, కరివేపాకు – 1 రెమ్మ‌, పసుపు – అర టీస్పూన్‌, ఉప్పు – త‌గినంత‌, కారంపొడి – 1 టీస్పూన్‌, రసం పొడి – 1 టీస్పూన్‌, తగినన్ని నీరు, కొత్తిమీర – ఒక క‌ట్ట‌, రెండు ఎండు మిర్చి, అర టేబుల్ స్పూన్ ఆవాలు.

Tomato Rasam recipe in telugu make in this way
Tomato Rasam

ట‌మాటా ర‌సం త‌యారు చేసే విధానం..

ముందుగా కుక్కర్లో టమోటాలను శుభ్రంగా కడిగి రెండు ముక్కలుగా కట్ చేసి, చింతపండు వేసి రెండు విజిల్స్ వచ్చేవరకు పెట్టాలి. విజిల్ వెళ్ళిన తర్వాత కాస్త ఉప్పును వేసి టమోటా ముక్కలను బాగా స్మాష్ చేయాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత నీటిని వేసుకొని అందులోకి కొద్దిగా పసుపు, తగినంత కారం, చిటికెడు ధనియాల పొడి కలుపుకోవాలి. మరొక గిన్నెలో పోపుకోసం కొద్దిగా నూనె వేసి నూనె వేడయ్యాక పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా మగ్గనివ్వాలి.

పోపు కొద్దిగా ఎర్రగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు రసం పొడి అందులో వేసి బాగా కలియబెట్టాలి. ఒక నిమిషం పాటు రసం పొడి మగ్గిన తర్వాత ముందుగా కలిపి ఉంచుకున్న టమోటా రసాన్ని బాగా మగ్గిన పోపులో వేయాలి. తరువాత స్టవ్ సిమ్ లో పెట్టి ఈ రసాన్ని బాగా ఉడికించాలి. ఈ విధంగా పది నిమిషాల పాటు ఉడికించిన తర్వాత దించేముందు కొత్తిమీర తురుము వేస్తే ఎంతో రుచికరమైన టమోటా రసం తయారైనట్లే. దీన్ని అన్నంలో వేడి వేడిగా తింటే ఎంతో రుచిగా ఉంటుంది. అంద‌రూ ఇష్టంగా తింటారు.

Share
Admin

Recent Posts