Jamakaya : జామ‌కాయ‌ల గురించి ఈ ఒక్క విష‌యం తెలిస్తే.. ఇప్పుడే కొని తింటారు..!

Jamakaya : మ‌న‌లో చాలా మంది అధిక ధ‌ర‌లు ఉన్న పండ్లు, మంచి రంగులో ఉండే పండ్లు మాత్ర‌మే మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తాయ‌ని భావిస్తారు. ఎంత ఎక్కువ ధ‌ర పెట్టి కొంటే ఆ పండు అంత మంచిద‌ని భావిస్తూ ఉంటారు. కానీ పండ్ల‌ల్లో అన్నింటి కంటే జామ‌పండు మేలైన పండ‌ని నిపుణులు చెబుతున్నారు. ప‌ది ర‌కాల పండ్ల‌ను తిన‌డానికి ఒక జామ‌పండును తింటే మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ ల‌భిస్తాయ‌ని వారు చెబుతున్నారు. అలాగే జామ‌పండు మ‌న‌కు సంవత్స‌ర‌మంతా ల‌భిస్తుంది. అలాగే చాలా త‌క్కువ ధ‌ర‌లో ల‌భిస్తుంది. ఎవ‌రైనా దీనిని సుల‌భంగా కొనుగోలు చేసి తీసుకోవ‌చ్చు.

అలాగే జామ‌చెట్ల‌ను పెంచ‌డానికి ఎక్కువ‌గా ఎరువులు, పురుగు మందులు వాడాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. అలాగే ఇత‌ర పండ్ల‌ను పూర్తిగా ప‌క్వానికి రాక‌ముందే సేక‌రించి కార్బైడ్ పెట్టి మ‌గ్గించి అమ్ముతూ ఉంటారు. కానీ జామ‌కాయ‌ల‌ను మ‌నం ప‌క్వానికి రాక‌ముందే కోయ‌లేము. ప‌క్వానికి రాని జామ‌కాయ‌ల‌ను మ‌నం అస్స‌లు తిన‌లేము. క‌నుక వీటిని మ‌నం అస్స‌లు క‌ల్తీ చేయ‌లేమ‌ని వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. 100 గ్రాముల జామ‌కాయ‌లో 45 నుండి 50 క్యాల‌రీల శ‌క్తి, 200 మిల్లీ గ్రాముల విట‌మిన్ సి ఉంటుంది. మామిడికాయ‌, అర‌టిపండ్ల‌ను తిన‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు వెంట‌నే పెరుగుతాయి. కానీ జామ‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

Jamakaya know these facts before you take
Jamakaya

వీటిలో ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది. ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉన్న కార‌ణంగా జామ‌కాయ‌లు జీర్ణం అవ్వ‌డానికి స‌మ‌యం ప‌డుతుంది. దీంతో గ్లూకోజ్ ర‌క్తంలో నెమ్మ‌దిగా క‌లుస్తుంది. క‌నుక జామ‌కాయ‌లు షుగ‌ర్ తో బాధ‌ప‌డే వారికి చ‌క్క‌టి ఆహార‌మ‌ని నిపుణులు చెబుతున్నారు. షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు రోజుకు రెండు జామ‌కాయ‌ల‌ను తిన్నా కూడా ఎటువంటి హాని క‌లగ‌దు. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల భ‌విష్య‌త్తులో కూడా షుగ‌ర్ రాకుండా ఉంటుంది. అదే విధంగా జామ‌కాయ‌లో క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉన్నందున బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు కూడా వీటిని తీసుకోవ‌చ్చు. అలాగే జామ‌కాయ‌ల్లో కంటే జామ‌పండ్ల‌ల్లో పోష‌కాలు మ‌రింత ఎక్కువ‌గా ఉంటాయ‌ని క‌నుక ఎప్పుడూ తీసుకున్నా కూడా జామ‌పండ్ల‌ను ఎక్కువ‌గా తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

అలాగే జామ‌పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య త‌గ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. జ‌లుబు, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌లు మ‌న ద‌రి చేరుకుండా ఉంటాయి. జామ‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగుప‌డుతుంది. ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ వ్య‌వ‌స్థ మెరుగుప‌డుతుంది. శ‌రీరంలో ఇన్ ప్లామేష‌న్ త‌గ్గుతుంది. క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధుల బారిన ప‌డ‌కుంటా ఉంటాము. ఈ విధంగా జామ‌కాయ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని వీటిని రోజుకు ఒక‌టి చొప్పున అంద‌రూ త‌ప్ప‌కుండా తీసుకోవాల‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు.

D

Recent Posts