Juices For Beauty : చర్మం అందంగా, కాంతివంతంగా, మెరిసిపోతూ ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. చర్మం నిగారింపుకు అనేక రకాల చిట్కాలను వాడుతూ ఉంటారు. అలాగే మార్కెట్ లో భించే క్రీములను, పౌడర్ లను, లోషన్ లను వాడుతూ ఉంటారు. చర్మం అందంగా కనబడడానికి ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు కూడా. అయినప్పటికి చాలా మందికి సరైనఫలితం దక్కనే చెప్పవచ్చు. అయితే చర్మం కాంతివంతంగా కనబడాలంటే క్రీములను వాడడానికి బదులుగా సరైన ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మన చర్మం యొక్క అందం, ఆరోగ్యం మనం తీసుకునే ఆహారంపైనే ఆధారపడి ఉంటుందని వారు చెబుతున్నారు. ఎండ, కాలుష్యం, దుమ్ము నుండి చర్మాన్ని కాపాడుకోవాలి. అయితే బాహ్యంగా ఉండే ఈ దోషాల నుండి చర్మం తనని తాను రక్షించుకునే తత్వం సహజంగానే చర్మానికి ఉంటుందని వారు చెబుతున్నారు.
ఇలా చర్మం తనని తాను రక్షించుకోవాలంటే మనం తగినంత నీటిని నీటిని తాగాలని నిపుణులు తెలియజేస్తున్నారు. నీటిని ఎక్కువగా తాగడం వల్ల చర్మం కాంతివంతంగా, నిగనిగలాడుతూ ఉంటుంది. నీటిని తక్కువగా తీసుకోవడం వల్ల చర్మం పొడిబారి డ్రై స్కిన్ గా మారుతుంది. అలాగే మనం తీసుకునే ఆహారం కారణంగానే మన చర్మం జిడ్డుగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. కనుక రోజూ తగినంత నీటిని తాగడం వల్ల చర్మం సహజంగానే నిగారిస్తుందని, కాంతివంతంగా తయారవుతుందని వారు చెబుతున్నారు. రోజూ 4 లీటర్ల నీటిని తాగడం వల్ల చర్మ అందంగా, ఆరోగ్యంగా ఉండడంతో పాటు డ్రై స్కిన్, చర్మం జిడ్డు కారడం వంటి సమస్యలు కూడా తగ్గుతాయని వారు తెలియజేస్తున్నారు. నీటిని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన మలినాలను, విష పదార్థాలను, అధికంగా ఉన్న లవణాలను మూత్రపిండాలు బయటకు పంపిస్తాయి.
దీంతో శరీరంతో పాటు చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. నీటిని తాగడం వల్ల చర్మం పగలడం, గీతలు పడడం, పొట్టు రాలడం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఇలా నీటిని తాగడంతో పాటు రోజూ రెండు రకాల జ్యూస్ లను తాగాలి. ఉదయం పూట క్యారెట్, బీట్ రూట్, టమాటాలు, కీరదోసతో జ్యూస్ చేసి తీసుకోవాలి. దీంతో తగినంత విటమిన్ ఎ లభిస్తుంది. అలాగే సాయంత్రం నారింజ, బత్తాయి వంటి వాటితో జ్యూస్ ను చేసి తీసుకోవాలి. దీంతో విటమిన్ సి లభిస్తుంది. ఇలా విటమిన్ ఎ, విటమిన్ సి లభించడం వల్ల చర్మ కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇలా జ్యూస్ లను తీసుకోవడం వల్ల చర్మానికి హాని కలగకుండా ఉంటుంది. ఈ విధంగా నీటిని తాగడంతో పాటు రోజూ రెండు రకాల జ్యూస్ లను తీసుకోవడం వల్ల ఎటువంటి సబ్బులు, క్రీములు వాడే అవసరం లేకుండా చర్మం సహజంగానే అందంగా, కాంతివంతంగా తయారవుతుందని నిపుణులు చెబుతున్నారు.