Kunkudu Kaya : ఒకప్పుడు ప్రతి ఒక్కరూ కుంకుడుకాయలతోనే జుట్టును శుభ్రం చేసుకునే వారు. ప్రతి గ్రామంలో కుంకుడుకాయ చెట్లు ఉండేవి. కానీ ప్రస్తుత కాలంలో రకరకాల షాంపులను వాడుతున్నారు. రకరకాల జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. సహజ సిద్దంగా లభించే ఈ కుంకుడు కాయలు జుట్టు సంరక్షణలో ఎంతగానో ఉపయోగపడతాయి. కుంకుడు కాయలే కాకుండా కుంకుడు చెట్టులో ప్రతిభాగం మనకు ఎంతో మేలు చేస్తుంది. మనకు వచ్చే అనేక అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఈ చెట్టు ఎంతగానో ఉపయోగపడుతుంది. కేశ సంరక్షణలో ఎంతగానో ఉపయోగపడే ఈ కుంకుడు చెట్లను మరలా పెంచాలి. వాటిని సంరక్షించాలి.
కుంకుడుకాయల గుజ్జు చేదుగా ఉండి శ్లేష్మంతో కూడిన వాంతిని కలుగజేస్తుంది. ఉబ్బసాన్ని తగ్గించడంతోపాటు ఆరోగ్యాన్ని కలగజేయడంలో ఈ చెట్టు ఎంతగానో సహాయపడుతుంది. కుంకుడు కాయలను నలగ గొట్టి వస్త్రంలో కట్టి తలకు కట్టుకుంటే శిరస్సులో ఉండే వాతం తగ్గి తలనొప్పి తగ్గుతుంది. మూర్ఛ వ్యాధి వచ్చిన వెంటనే కుంకుడు కాయలను వేడి నీటిలో వేసి నలిపి ఆ రసాన్ని మూడు చుక్కల మోతాదులో ముక్కులో వేయడం వల్ల వెంటనే తెలివి వస్తుంది. తేలు కుట్టిన వెంటనే కుంకుడుకాయను నీటితో కలిపి అరగదీసి ఆ గంధాన్ని తేలు కుట్టిన చోట దట్టంగా రాయడం వల్ల తేలు విషం హరించుకుపోతుంది.
కుంకుడు కాయలు 10 గ్రాములు, రేవల చిన్ని 10 గ్రాముల మోతాదులో తీసుకుని నీటితో కలిపి అరగదీసి శనగ గింజల పరిమాణంలో మాత్రలుగా చేసి నిల్వ చేసుకోవాలి. పాము కుట్టిన వెంటనే ఒక మాత్రను ఆవు నెయ్యితో కలిపి తినిపించాలి. ఇలా రెండు గంటలకొకసారి మూడు సార్లు తినిపించడం వల్ల వాంతి ద్వారా కానీ విరేచనం ద్వారా కానీ విషం బయటకు పోతుంది. మూర్ఛ వచ్చిన వెంటనే కుంకుడుకాయ బెరడును నీటితో కలిపి నూరి ఆ గంధాన్ని మూర్ఛవచ్చిన వారి ముక్కు వద్ద ఉంచి వాసన చూపించాలి. ఇలా చేయడం వల్ల మూర్ఛ వచ్చిన వారికి తెలివి త్వరగా వస్తుంది. తరువాత కూడా రోజుకు మూడు సార్లు ఇలా వాసనను చూపిస్తూ ఉంటే మూర్ఛ, ఫిట్స్ రాకుండా ఉంటాయి.
నీటిలో ఉప్పు వేసి కలిపి ఆ నీటితో కుంకుడుకాయను నూరి ఆ మిశ్రమాన్ని పేను కొరికిన చోట రోజుకు మూడు సార్లు దట్టంగా రాయాలి. ఇలా చేయడం వల్ల మూడు రోజులల్లోనే పేను కొరుకుడు తగ్గి ఆ చోట కొత్త వెంట్రుకలు వస్తాయి. కుంకుడు కాయను కానీ లేదా కుంకుడు కాయ గింజలో ఉండే పప్పును కానీ పొడి చేసి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని పూటకు మూడు చిటికెల మోతాదులో ఒక టీ స్పూన్ తేనెతో కలిపి రెండు పూటలా తీసుకుంటూ ఉండడం వల్ల ఉబ్బసం తగ్గుతుంది. వడపోసిన కుంకుడుకాయ రసాన్ని మూడు మూడు చుక్కల మోతాదులో రెండు ముక్కు రంధ్రాలలో వేయడం వల్ల తీవ్రంగా ఉన్న ఉబ్బసం కూడా తగ్గుతుంది.
కుంకుడు కాయ బెరడు 50 గ్రాములు, కరక్కాయ బెరడు 100 గ్రాముల మోతాదులో తీసుకుని పొడిగా చేసి దానికి తగినంత తేనెను కలిపి ముద్దలా చేసి నిల్వ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రెండున్నర గ్రాముల మోతాదులో రోజూ ఉదయం పూట సేవిస్తూ ఉండడం వల్ల పాండు రోగం తగ్గుతుంది. కుంకుడు కాయను నూరి ఆ గంధాన్ని గొంతుకు రాయడం వల్ల వెక్కిళ్లు తగ్గుతాయి. కుంకుడుకాయను నూరి శనగ గింజల పరిమాణంలో మాత్రలుగా చేసి నిల్వ చేసుకోవాలి. పూటకు ఒక మాత్ర చొప్పున మూడు పూటలా పలుచని తియ్యని మజ్జిగతో కలిపి తీసుకుంటే అర్ష మొలలు తగ్గుతాయి. ఈ విధంగా కుంకుడు కాయను ఉపయోగించడం వల్ల మనకు వచ్చే అనేక రకాల వ్యాధులను నయం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.