Left Side Sleeping : మనలో చాలో మంది రాత్రి నిద్రించేప్పుడు రకరకాల భంగిమల్లో పడుకుంటారు. బోర్లా పడుకొని నిద్రించడం, వెల్లకిలా నిద్రించడం ఇలా వివిధ రకాలుగా చేస్తూ ఉంటారు. అయితే ఎడమ వైపు తిరిగి నిద్రించడం వలన చాలా ఆరోగ్య కరమైన లాభాలు ఉన్నాయని చాలా తక్కవ మందికి మాత్రమే తెలుసు. అయితే ఆ ప్రయోజనాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఎడమవైపు తిరిగి నిద్రించడం వలన మన శరీరంలోని విష పదార్థాలు వేగంగా బయటికి వెళ్లడాన్ని సులభతరం చేస్తుంది. గురుత్వాకర్షణ శక్తి వలన రక్త ప్రసరణ పెరిగి ప్లీహం పనితీరు మెరుగుపడుతుంది. ఎడమ వైపు తిరిగి నిద్రించడం అనేది గర్భిణీ స్త్రీలను సురక్షితంగా ఉంచుతుంది. ఇది వీరిలో రక్త ప్రసరణను మెరుగు పరచడంతోపాటు మోకాళ్లకు, కాళ్లకు, వెన్నుపూసకు తగిన రక్షణను అందిస్తుంది.
ఇంకా ఎడమవైపు తిరిగి నిద్రించడం వలన బ్లడ్ ప్రెషర్ అదుపులో ఉండి గుండెకి రక్త ప్రసరణ సాఫీగా జరిగి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. లివర్ పనితీరు మెరుగుపడుతుంది. జీర్ణక్రియ సమర్థవంతంగా పనిచేస్తుంది. జీర్ణాశయంలోని వ్వర్థాలను తీసివేసి ఉదయం విరేచనం సాఫీగా జరిగేలా చేస్తుంది. అలసటను కూడా దూరం చేస్తుంది. యాసిడిటీ వలన గుండెలో, పొట్టలో కలిగే మంటలను తగ్గిస్తుంది. కనుక ఎడమ వైపుకు తిరిగి నిద్రించాలి. దీంతో పైన తెలిపిన విధంగా లాభాలను పొందవచ్చు.