Vomiting : దీన్ని 1 టీస్పూన్ తింటే చాలు.. గ్యాస్, వాంతులు, వికారం మాయం..

Vomiting : మ‌న‌లో చాలా మందికి ప్ర‌యాణాలు చేసేట‌ప్పుడు వాంతులతో ఇబ్బంది ప‌డుతుంటారు. ఈ వాంతుల కార‌ణంగా నీర‌సం, వికారం వంటి ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతూ ఉంటాయి. ఇలా ప్ర‌యాణాలు చేసేట‌ప్పుడు వాంతులు అవ్వ‌డంతో ఎక్క‌డికి వెళ్లాల‌న్నా కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఇంటి చిట్కాను ఉప‌యోగించి మ‌నం ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.

ప్ర‌యాణాలు చేసేట‌ప్పుడు ఈ చిట్కాను ప్ర‌య‌త్నించ‌డం వ‌ల్ల వాంతులు అవ్వ‌కుండా ఉంటాయి. ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో అర చెక్క నిమ్మ‌ర‌సాన్ని తీసుకోవాలి. త‌రువాత ఇందులో ఒక పావు టీ స్పూన్ యాల‌కుల పొడిని, ఒక టీ స్పూన్ తేనెను వేయాలి. త‌రువాత ఇవి అన్నీ క‌లిసేలా ఒక నిమిషం పాటు బాగా క‌ల‌పాలి. ఈ విధంగా త‌యారు చేసుకున్న ఈ మిశ్ర‌మాన్ని ప్ర‌యాణం చేయానికి ముందు ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకోవాలి.

here it is how to stop Vomiting and nausea
Vomiting

అలాగే ఈ మిశ్ర‌మాన్ని ప్ర‌యాణం చేసేట‌ప్పుడు మ‌ధ్య‌లో అప్పుడ‌ప్పుడూ ఒక టీ స్పూన్ మోతాదుగా తీసుకుంటూ ఉండాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ప్ర‌యాణం చేసేట‌ప్పుడు వాంతులు అవ్వ‌కుండా ఉంటాయి. నిమ్మ‌ర‌సం, తేనె, యాల‌కులల్లో ఉండే ఔష‌ధ గుణాలు వాంతులు అవ్వ‌కుండా చేయ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. అంతేకాకుండా వికారం కూడా త‌గ్గుతుంది. ఈ విధంగా ఇంటి చిట్కాను పాటించి ప్ర‌యాణం చేసేట‌ప్పుడు వాంతులు అవ్వ‌కుండా నివారించ‌వ‌చ్చు.

Share
D

Recent Posts