హెల్త్ టిప్స్

నిద్ర‌లో ఉన్న‌ప్పుడు సడెన్‌గా కండ‌రాలు ప‌ట్టేస్తే వెంట‌నే ఇలా చేయండి..!

సాధారణంగా అప్పుడప్పుడు కండరాలు పట్టేస్తూండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. కండరాల నొప్పిని చాలా మంది ఫేస్ చేసే ఉంటారు. పూర్వం పెద్దవాళ్లకే ఇలా కండరాలు పట్టేసావి. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేదు. ఎవరికైనా పట్టేస్తున్నాయి. మారిన జీవన శైలి, ఆహార అలవాట్ల కారణంగా కండ‌రాలు ప‌ట్టేయ‌డం జ‌రుగుతుంది. కొందరికి కాళ్లలో నరాలు లాగేసినట్లు అవుతాయి. నరం పట్టేసుకుంటుంది. కండరం పట్టేసినట్లు అనిపిస్తుంది.కొన్ని క్ష‌ణాల పాటు చాలా ఇబ్బందిని ఎదుర్కొంటారు.సాధార‌ణంగా ఇలాంటి స‌మ‌స్య ఎక్కువ‌గా పెద్ద వారికి ఉంటుంది. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కండరాలు అకస్మాత్తుగా బిగుసుకుపోయినప్పుడు ఈ సమస్య ఎక్కువగా అనిపిస్తుంది.

కొందరిలో ఆ నొప్పి మరుసటి రోజు వరకు ఉంటుంది. తరచుగా ఈ సమస్యను ఎదుర్కొంటుంటే దానికి కారణాలు, చికిత్సను తెలుసుకోవడానికి వెంటనే మీ వైద్యుడిని సంప్రదించండం మంచింది. అయితే ఇలా ఎందుకు వ‌స్తుంద‌నే దానికి ప్ర‌త్యేకమైన కార‌ణం ఏంట‌నేది చెప్ప‌లేం కాని వైద్యులు చెప్పే ప‌లు కార‌ణాలు ఏంటో చూద్దాం. డీ హైడ్రేష‌న్ వ‌ల‌న కూడా కాళ్ల‌లో న‌రాలు ప‌ట్టేయ‌డం జ‌రుగుతుంది. శరీరానికి కావాల్సినంత నీరు అందనప్పుడు కండరాలు సక్రమంగా పనిచేయడానికి అవసరమైన నీరు లభించదు. శరీరంలో ఎలక్ట్రోలైట్ అసమతుల్యత కూడా కాలు తిమ్మిరికి కారణమవుతుంది. కండరాల అలసట, స్ట్రెచ్చింగ్ కాలు తిమ్మిరికి కారణమవుతుంది.

leg cramps at night follow this tip

అధిక రక్తపోటుకు చికిత్స చేసేటప్పుడు తీసుకునే మందులు కూడా కాలు తిమ్మిర్లకు ప్ర‌ధాన కార‌ణంగా చెప్ప‌వ‌చ్చు. అయితే ఈ తిమ్మిర్ల‌కి ఉప‌శ‌మ‌నం ఇచ్చేందుకు గాను నొప్పి ఉన్న చోట కండరాన్ని తేలికగా రుద్దుతూ మసాజ్ చేయండి. అలాగే కాలిని ముందుకు వెనక్కి కదిలించండి. నరం పట్టుకోవడం వల్ల వచ్చే నొప్పిని తగ్గించడానికి మీరు వేడి టవల్, వేడి నీటి బాటిల్ లేదా హీట్ ప్యాడ్ తో మసాజ్ చేస్తే వెంటనే ఉపశమనం ఉంటుంది. కావాలనుకుంటే వేడినీటి స్నానం కూడా చేయొచ్చు. నిమ్మరసంలో విటమిన్ సి ఉంటుంది. దీంట్లో రాక్ సాల్ట్ లేదా పింక్ సాల్ట్ కలుపుకుని తాగితే కూడా ఉప‌శ‌మ‌నం ఉంటుంది.

Sam

Recent Posts