హెల్త్ టిప్స్

Lemon And Jaggery Water : ఉద‌యం టీ, కాఫీల‌కు బ‌దులుగా దీన్ని తాగితే పొట్ట క‌రుగుతుంది.. మ‌ళ్లీ రాదు..!

Lemon And Jaggery Water : చాలా మంది ఈరోజుల్లో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఎక్కువ మంది ఊబకాయం, అధిక బరువు సమస్యల‌తో బాధపడుతున్నారు. శరీర బరువు పెరిగిపోవడం చాలా ఈజీ. కానీ తగ్గడం చాలా కష్టం. అయితే పొట్ట రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, పొట్ట రాకుండా ఉండాలంటే ఏ చిట్కాలు అని పాటించాల‌ని చాలా మంది చూస్తున్నారు. అయితే పొట్ట రాకుండా ఉండాలంటే ఇలా చేస్తే చాలు. ఇక పొట్ట రాదు.

ప్రతి ఒక్కరు కూడా ఫిట్ గా ఉండాలని అనుకుంటారు. పొట్ట రాకుండా చూసుకుంటూ ఉంటారు. శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వుని వేగంగా తగ్గించడానికి ఇవి బాగా సహాయపడతాయి. నిమ్మ రసంలో చక్కెర కానీ తేనె కానీ వేసుకుని చాలామంది తీసుకుంటూ ఉంటారు. అయితే నిమ్మరసంలో బెల్లం వేసుకుని కూడా తీసుకోవచ్చు. కానీ చాలా మందికి ఈ విషయం తెలియదు.

lemon and jaggery gives more benefits

నిమ్మరసంలో బెల్లం కలిపి తీసుకోవడం వలన చక్కటి లాభాలు ఉంటాయి. 1 టీ స్పూన్ నిమ్మరసం, 1 స్పూన్ బెల్లం పొడి, ఒక గ్లాసు నిండా వెచ్చని నీళ్లు తీసుకుని కలుపుకోవాలి. దీన్ని తీసుకుంటే ఇక అసలు పొట్ట రానే రాదు. విటమిన్ సి నిమ్మలో ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గడానికి నిమ్మ బాగా సహాయం చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా చూస్తాయి.

బెల్లం వలన కూడా ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉంటాయి. బెల్లంలో ప్రోటీన్, ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వాళ్ళు బెల్లం, నిమ్మరసం తీసుకోవడం వలన చక్కటి లాభం ఉంటుంది. నీళ్లు మరిగించి మరిగిన నీళ్లలో బెల్లం పొడి, నిమ్మరసం వేసుకోండి. ఉదయాన్నే టీ, కాఫీ కి బదులుగా దీనిని మీరు తీసుకుంటే పొట్ట రాదు. పొట్ట రాకుండా ఫిట్ గా ఉండాలనుకునే వాళ్ళకి ఇది దివ్య ఔషధం అని చెప్పొచ్చు. టీ, కాఫీలకి బదులుగా దీనిని మీరు తీసుకుంటే పొట్ట రాకుండా ఉంటుంది. అధిక బరువు వంటి సమస్యలు ఉండవు. ఆరోగ్యంగా ఉండొచ్చు.

Admin

Recent Posts