Bottle Gourd Juice : మనం నిత్యం ఉపయోగించే కూరగాయలలో సొరకాయ ఒకటి. సొరకాయలను మనం నిత్యం వంటకాలలో, స్వీట్ల తయారీలో ఉపయోగిస్తాం.కానీ సొరకాయలో అనేక పోషకాలను కలిగి ఉండి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అయితే సొరకాయను జ్యూస్ రూపంలో తీసుకుంటే ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఇలా అనేక పోషకాలను కలిగి ఉన్న సొరకాయను జ్యూస్ ని రెగ్యులర్ గా తీసుకోవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ముందుగా సొరకాయ జ్యూస్ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక సొరకాయను ముక్కలు చేసి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇందులోనే జీలకర్ర పొడి, మిరియాల పొడి, పుదీనా ఆకులు, తగినంత ఉప్పు వేసి జ్యూస్ లా తయారు చేసుకోవాలి. ఈ జ్యూస్ ను తాగడం వలన చర్మం డీహైడ్రేషన్ బారినపడకుండా ఉంటుంది.
సొరకాయలో యాంటి ఆక్సిడెంట్స్ అధికంగా ఉండడం వల్ల కణాలు డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. సొరకాయలో ఎక్కువ శాతం నీరు ఉండి తక్కువ ఫ్యాట్ కలిగి ఉంటుంది. శరీరంలో అధిక వేడిని బయటకు పంపి చల్లదనాన్ని కలిగిస్తుంది. సొరకాయలో విటమిన్ బి, విటమిన్ సి, సోడియం, జింక్, ఐరన్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఈ జ్యూస్ తాగటం వలన శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపించి శరీర బరువును తగ్గిస్తుంది. సొరకాయ జ్యూస్ విరోచనాలను తగ్గించడానికి చక్కని ఔషధంలా పనిచేస్తుంది.
ఈ జ్యూస్ తీసుకోవటం విరేచనాల కారణంగా శరీరం కోల్పోయిన ఖనిజాలను తిరిగి భర్తీ చేస్తుంది. కంటి చూపును మెరుగు పరచడానికి కావలసిన విటమిన్ ఎ సొరకాయలో పుష్కలంగా ఉంటుంది. క్రమం తప్పకుండా సొరకాయ జ్యూస్ తాగడంతో కంటి చూపు మెరుగుపడుతుంది. సొరకాయలో జింక్ పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇవి గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది. శరీరంలోని రక్త సరఫరాను మెరుగుపరిచి అధిక రక్తపోటు సమస్యను తగ్గించి గుండె ఆరోగ్యవంతంగా పనిచేయడానికి చక్కగా పనిచేస్తుంది. రక్తహీనత సమస్యలతో బాధపడే స్త్రీలకు సొరకాయ చక్కని ఔషధంగా పనిచేస్తుంది. సొరకాయలో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తహీన సమస్యలను దరి చేరనివ్వదు.