హెల్త్ టిప్స్

అల్లం వ‌ల్ల ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా ?

భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచే అల్లాన్ని ఉప‌యోగిస్తున్నారు. దీన్ని త‌ర‌చూ వంట‌ల్లో పేస్ట్‌లా చేసి వేస్తుంటారు. దీంతో వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. అయితే ఆయుర్వేద ప‌రంగా అల్లం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. దీన్ని రోజూ ఏదో ఒక విధంగా తీసుకోవ‌డం వ‌ల్ల అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు. ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే ఒక టీస్పూన్ అల్లం ర‌సం సేవిస్తే మ‌న‌కు ఎంతో ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది. దీంతో అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. ఇక అల్లం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

అల్లం ర‌సాన్ని రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే ఒక టీస్పూన్ మోతాదులో సేవించ‌డం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌లు అన్నీ తొల‌గిపోతాయి. ముఖ్యంగా గ్యాస్, క‌డుపులో మంట‌, అజీర్ణం నుంచి విముక్తి ల‌భిస్తుంది. అలాగే దంతాలు, చిగుళ్ల నొప్పులు త‌గ్గుతాయి. నోటి దుర్వాస‌న త‌గ్గుతుంది. సీజ‌న‌ల్‌గా వ‌చ్చే ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. అల్లంలో ఉండే యాంటీ వైర‌ల్‌, యాంటీ బాక్టీరియ‌ల్ గుణాలు మ‌న‌ల్ని వ్యాధుల నుంచి ర‌క్షిస్తాయి.

many health benefits of ginger

అల్లంలో స‌హ‌జ‌సిద్ధ‌మైన యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ ల‌క్షణాలు ఉంటాయి. క‌నుక కీళ్ల నొప్పులు, కండ‌రాల నొప్పులు, వాపులు త‌గ్గుతాయి. అలాగే శ‌రీరంలో ఉండే వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు పోయి శ‌రీరం అంత‌ర్గ‌తంగా శుభ్రంగా మారుతుంది. శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. దీని వ‌ల్ల హైబీపీ త‌గ్గుతుంది. బీపీ నియంత్ర‌ణ‌లో ఉంటుంది.

మ‌హిళ‌లు రుతు స‌మ‌యంలో అల్లం ర‌సం సేవించ‌డం వ‌ల్ల వారికి ఆ స‌మ‌యంలో వ‌చ్చే నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. అలాగే అల్లం ర‌సంను రోజూ సేవించ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. క‌నుక అల్లం ర‌సాన్ని రోజూ సేవించాల్సిందే. దీంతో శ‌రీరం అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటుంది.

Admin

Recent Posts