హెల్త్ టిప్స్

ధ‌నియాల‌తో ఏయే వ్యాధుల‌ను ఎలా న‌యం చేసుకోవాలంటే..?

ధనియాలు మంచి ఔషధం లాగ పని చేస్తాయి. వీటి వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మధుమేహం నివారించడం లో అద్భుతంగా ఉపయోగ పడతాయి. మధుమేహం రాకుండా ఉండడానికి కూడా ఇవి బాగా పని చేస్తాయి. ధనియాల పొడి కొలెస్ట్రాల్ ని నియంత్రణ లో ఉంచుతుంది. ధనియాలని గ్రైండ్ చేసి ఒక గ్లాసు నీళ్లకు చేర్చి మరిగించి చల్లారిన తరువాత వడగట్టి తాగితే కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. దీన్ని మీరు నెల రోజుల పాటు చేశారు అంటే మంచి ప్రయోజనం కనిపిస్తుంది.

పీరియడ్స్ సమయం లో ఆరు గ్రాముల ధనియాలను ఒక అర లీటర్ నీళ్లకు కలిపి సగం నీళ్లు మాత్రం మిగిలేంత వరకూ మరిగించాలి. ఈ మిశ్రమం లో పటిక బెల్లం చేర్చి గోరు వెచ్చగా ఉన్నప్పుడే తీసుకోండి. ఇలా మూడు నాలుగు రోజుల పాటు చేస్తే పీరియడ్స్ సమయం లో రక్తస్రావం ఆధిక్యత తగ్గుతుంది. పైగా పీరియడ్స్ సరిగ్గా సమయానికి వస్తాయి.

many wonderful health benefits of coriander seeds many wonderful health benefits of coriander seeds

ధనియాలు ఏ రూపం లో తీసుకున్నా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరానికి ఇస్తాయి. దీని కారణంగా ఫ్రీరాడికల్స్ ను ఎదుర్కోవడానికి బాగా సహాయ పడుతాయి. కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు అందానికి కూడా ధనియాలు ఉపయోగ పడతాయి. ధనియాల పొడి మచ్చలను నివారిస్తుంది. ధనియాల పొడి లో పసుపు వేసి పేస్ట్ లాగ చేసి ముఖానికి పట్టించి ఉంచితే మంచి ఫలితం కనబడుతుంది.

Admin

Recent Posts