హెల్త్ టిప్స్

Fennel Seeds Water : రోజూ ఖాళీ క‌డుపుతో సోంపు గింజ‌ల నీళ్ల‌ను తాగితే..?

Fennel Seeds Water : మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ త‌గిన‌న్ని గంట‌ల‌పాటు నిద్ర‌పోవ‌డంతోపాటు రోజూ వ్యాయామం చేయాలి. త‌గిన పౌష్టికాహారాన్ని వేళ‌కు తీసుకోవాలి. దీంతోపాటు మాన‌సిక ఆరోగ్యం కూడా ముఖ్య‌మే. అందుకు గాను యోగా, ధ్యానం చేయాలి. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు. అయితే ఉద‌యాన్నే ఖాళీ క‌డుపుతో ఇప్పుడు చెప్ప‌బోయే ఓ పానీయాన్ని తాగ‌డం వ‌ల్ల మీరు ఎంతో ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. దీంతో మీకు అనేక అద్భుత‌మైన, ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఇంత‌కీ ఆ పానీయం ఏంటో తెలుసా.. అదేనండీ.. సోంపు నీళ్లు. సోంపు గింజ‌ల‌ను నీళ్ల‌లో వేసి మ‌రిగించి త‌యారు చేయాలి. ఇందులో అవ‌స‌రం అనుకుంటే తేనె, నిమ్మ‌ర‌సం క‌లుపుకోవ‌చ్చు. లేదా నేరుగా కూడా తాగ‌వ‌చ్చు.

ఇలా త‌యారు చేసిన సోంపు గింజ‌ల నీళ్ల‌ను ఉద‌యాన్నే ఖాళీ క‌డుపుతో తాగితే అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు. సోంపు గింజ‌ల నీళ్ల‌ను రోజూ ప‌ర‌గ‌డుపునే తాగితే శ‌రీరంలోని కొవ్వు క‌రిగిపోతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. ఈ నీళ్ల‌ను తాగితే జీర్ణ‌శ‌క్తి పెరుగుతుంది. అసిడిటీ, గ్యాస్‌, క‌డుపు ఉబ్బ‌రం త‌గ్గుతాయి. సోంపు గింజ‌ల నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల శ‌రీరం చ‌ల్ల‌గా ఉంటుంది. శ‌రీరంలోని వేడి త‌గ్గుతుంది. ఎండ దెబ్బ బారిన ప‌డ‌కుండా ఉంటారు. వేడి శ‌రీరం ఉన్న‌వాళ్ల‌కు ఈ నీళ్లు ఎంత‌గానో మేలు చేస్తాయి.

many wonderful health benefits of fennel seeds water on empty stomach

ఉద‌యాన్నే సోంపు గింజ‌ల నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలోని వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి. శ‌రీరం క‌డిగేసిన‌ట్లు క్లీన్ అవుతుంది. అంత‌ర్గ‌తంగా శుభ్రంగా మారుతుంది. చ‌ర్మ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ఇలా ఈ నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Admin

Recent Posts