హెల్త్ టిప్స్

అవునా.. మేకపాలలో ఇన్ని సుగుణాలున్నాయా…?

సండే స్పెషల్ ఏంటి.. అని అడిగితే.. 100 లో యాబై మంది దాకా మటన్ అంటూ నోరూరేలా చెబుతుంటారు. ఎందుకంటే.. మటన్ అయితే మంచిది కదా తినడానికి… చికెన్ వేడీ అంటారు. బలం కావాలంటే మటనే కదా తినాల్సింది అంటూ దీర్ఘాలు తీస్తారు. అవును.. మీరు చెప్పింది కరెక్టే కానీ.. మేకను వండుకొని తినేకన్నా.. దాని పాలు తాగితే ఇంకా లాభాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. పదండి.. అవేంటో తెలుసుకొని మేక పాలను ఓ చూపు చూద్దాం..

శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ మేకపాలలో ఉంటాయట. ట్రైప్టోఫాన్ అనే ఎమినో యాసిడ్స్ మేక పాలల్లో ఉండటం వల్లే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయని వైద్యులు పేర్కొంటున్నారు. ఒక కప్పు మేక పాలలో 35 శాతం ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయట. వాటి వల్ల ఎముకల పటిష్టత, కీళ్ల నొప్పుల నివారణకు ఇవి ఎంతో ఉపయోగపడతాయట. ఎముకల పటిష్టత, కీళ్ల నొప్పుల నివారణకు ఇవి సహకరిస్తాయి. మేకపాలలో ఉండే బయో ఆర్గానిక్ సోడియమ్, కణాల వృద్ధికి కూడా మేకపాలు ఎంతో మంచివి.

many wonderful health benefits of goat milk

ఇప్పుడు చెప్పుకోబోయేది చాలా ముఖ్యమైనది.. చాలా మంది డెంగ్యూ బారిన పడుతుంటారు. అటువంటి వాళ్ల రక్తంలో పడిపోయే ప్లేట్ లెట్ల సంఖ్యను పెంపొందించడానికి మేకపాలు ఉపయోగపడతాయట. రక్తహీనతతో బాధపడేవారు కూడా మేకపాలను తాగితే మంచి ఫలితాలు ఉంటాయట. కొన్ని దేశాల్లో అయితే మేకపాలకు ఫుల్లు డిమాండ్ ఉంది. ఆవు పాలు, గేదె పాలలాగానే మేక పాల నుంచి వెన్న, మీగడ, ఐస్ క్రీమ్ లాంటి వాటిని తయారు చేస్తారట. లైంగిక సమస్యలకూ మేకపాలు పరిష్కారం చూపిస్తాయట. ఇన్ని సుగుణాలు ఉన్న మేక పాలు ఆవుపాలు, గేదె పాల కన్నా త్వరగా జీర్ణమవుతాయట.

Admin

Recent Posts