ఘాటైన గరం మసాలాలకు పెట్టింది పేరు భారతదేశం. ఏ వంటకానికైనా మసాలాలు లేనిదే పర్ఫెక్ట్ రుచి ఉండదు. మనం వాడే మసాలా దినుసులు ప్రతి ఒక దానికి ఒక ప్రత్యేకత స్థానం ఉంటుంది. చాలా మందికి మసాలా దినుసులు మాత్రమే తెలుసు. కానీ వాటి వల్ల కలిగే ప్రయోజనాలు మాత్రం చాలా మందికి తెలియకపోవచ్చు. మసాలా దినుసులను ఆహారంలో తీసుకోవడం ద్వారా ప్రత్యేకమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
బిర్యానీ అంటే మొదటగా గుర్తుకు వచ్చేది జాజికాయ, జాపత్రి. ఈ జాపత్రి వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయి. జాపత్రి ఉపయోగించడం వలన మన ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం. ఇక మసాలాలకు దూరంగా ఉండేవారు ఈ విషయాలను కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.
ఒత్తిడి, ఆందోళన, మానసిక సమస్యలతో బాధపడుతున్న వారు జాపత్రిని ఆహారంగా తీసుకోవడం ద్వారా ఈ సమస్యల నుంచి బయట పడవచ్చు.అంతేకాకుండా డయాబెటిస్ ఉన్నవారు జాపత్రిని ఆహారంలో తీసుకోవడం ద్వారా షుగర్ లెవల్స్ తగ్గుముఖం పడతాయి. దుర్వాసన, చిగురు వాపు, దంత సమస్యలతో బాధపడేవారు కూడా జాపత్రిని తినడం ద్వారా మంచి ప్రయోజనాలు కలుగుతాయి.
సన్నగా ఉన్నవారు రోజువారి ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్యకరమైన రీతిలో బరువు పెరుగుతూ దృఢంగా తయారవుతారు. జీర్ణ సమస్యలతో బాధపడేవారు, గ్యాస్ సమస్యలకు మంచి ఉపశమనం కావాలనుకునేవారు జాపత్రిని టీలో వేసుకుని తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. కిడ్నీలో రాళ్లు, ఇన్ఫెక్షన్లు ఉన్నవారు జాపత్రిని ఆహారంగా వినియోగించటం ద్వారా ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు.
అంతేకాకుండా కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులతో బాధపడేవారు జాపత్రితో తయారు చేసిన నూనెను ఉపయోగించడం ద్వారా ఉపశమం కలుగుతుంది. అదేవిధంగా జలుబు, దగ్గుతో బాధపడేవారికి కూడా ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది. అందుకే దగ్గు, జలుబు మందుల తయారీలో జాపత్రిని ఔషధంగా ఉపయోగిస్తారు. ఇలా జాపత్రితో మనం అనేక లాభాలను పొందవచ్చు.