హెల్త్ టిప్స్

Coriander Leaves : కొత్తిమీర వ‌ల్ల ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Coriander Leaves : కొత్తిమీర అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. మనం ఏ కూర చేసినా తప్పని సరిగా కొత్తిమీరను ఉపయోగిస్తాము. కొత్తిమీర వంటలకు రుచిని మాత్రమే కాకుండా మ‌న‌కు ఎన్నో ఆరోగ్యక‌ర‌మైన‌ ప్రయోజనాలను అందిస్తుంది. అందుకే ప్రతి ఒక్క వంటలో కొత్తిమీరను విరివిగా ఉపయోగిస్తారు. అయితే కొత్తిమీర ద్వారా మ‌న‌కు ఎలాంటి ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.. అన్న విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

1. కొత్తిమీరలో పీచుపదార్థాలు, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. తక్కువ కేలరీలు కలిగి అధికంగా యాంటీఆక్సిడెంట్లు ఉండడం వల్ల మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ క‌రిగిపోతుంది. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి.

2. కొత్తిమీరలో ప్రోటీన్స్, కాల్షియం, ఫాస్ఫరస్, ఆక్సాలిక్ యాసిడ్స్, పొటాషియం, ఐరన్, సోడియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. క‌నుక శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. వ్యాధులు రాకుండా అడ్డుకోవ‌చ్చు.

coriander leaves many wonderful health benefits

3. నోటి పూత, కడుపు ఉబ్బరం, అలర్జీ, నోటి దుర్వాసన వంటి సమస్యలతో బాధపడేవారు రోజూ ఒక క‌ప్పు కొత్తిమీర జ్యూస్ ను తాగితే ఫ‌లితం ఉంటుంది.

4. తీవ్రమైన తలనొప్పితో బాధపడేవారు కొత్తిమీర రసాన్ని తలపై మర్దనా చేయాలి. దీంతో క్షణాల్లో తలనొప్పి మాయం అవుతుంది. లేదా కొత్తిమీర జ్యూస్‌ను అయినా తాగ‌వ‌చ్చు.

5. ముఖంపై మచ్చలు, మొటిమలు సమస్య‌ల‌తో బాధపడేవారు ప్రతి రోజూ రాత్రి నిద్రించే ముందు కొత్తిమీర రసంలో కాస్త పసుపు కలిపి ముఖానికి రాయాలి. మ‌రుస‌టి రోజు ఉద‌యం క‌డిగేయాలి. ఇలా చేస్తుంటే మొటిమ‌లు, మ‌చ్చ‌లు త‌గ్గిపోతాయి.

Admin

Recent Posts