హెల్త్ టిప్స్

Tamarind Health Benefits : పులుపుగా ఉంటుంద‌ని చింత‌పండును దూరం పెడితే.. ఈ లాభాల‌ను కోల్పోతారు..!

Tamarind Health Benefits : చింతపండుని పులిహోర మొదలు కూరలు ఇలా అనేక వంటల్లో వాడుతూ ఉంటాము. చింతపండు వలన కలిగే లాభాల గురించి, చాలా మందికి తెలియదు. చింతపండు పుల్లటి రుచిని వంటలకి ఇస్తుంది. ఆరోగ్యానికి అసలు చింతపండు మేలు చేస్తుందా..? లేదా..? అనే విషయాన్ని ఇప్పుడు చూసేద్దాం. చింతపండు గురించి పోషకాహార నిపుణులు పలు విషయాలని చెప్పారు. మరి పోషకాహార నిపుణులు చెప్పిన ఆ విషయాలను ఇప్పుడే చూద్దాం. చింతపండు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పలు ప్రయోజనాలని చింతపండు అందిస్తుంది.

చింతపండు కూరలకి, పులిహోర వంటి వాటికి మంచి రుచిని, ఇవ్వడమే కాకుండా పోషకాలని కూడా అందిస్తుంది. చింతపండును తీసుకోవడం వలన పేగు ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందట. పోషకాహారా నిపుణులు చెప్పిన దాని ప్రకారం చూసినట్లయితే, చింతపండు క్లీనింగ్ ఏజెంట్ గా పనిచేస్తుందట. పేగు పనితీరు మెరుగు పడుతుంది. జీర్ణక్రియని కూడా చింతపండు మెరుగుపరుస్తుంది.

many wonderful health benefits of tamarind

అలానే, చింతపండులో యాంటీ ఫంగల్ గుణాలు కూడా ఉంటాయి. యాంటీ ఫంగల్ గుణాలు ఎక్కువ ఉండడం వలన, వివిధ సమస్యలకు దూరంగా ఉండవచ్చు. చింతపండును తీసుకుంటే, గుండె ఆరోగ్యం కూడా బాగుంటుంది. పొటాషియం సహజంగా రక్తపోటుని తగ్గించడానికి సహాయం చేస్తుంది. పొటాషియంతో పాటుగా మెగ్నీషియం కూడా చింతపండులో ఎక్కువ ఉంటుంది. చింతపండును తీసుకుంటే, రక్తపోటుని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు.

అలానే, కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కూడా కంట్రోల్ చేయడానికి, చింతపండు బాగా ఉపయోగపడుతుంది. చింతపండును తీసుకోవడం వలన రోగనిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి చూస్తున్నారు. రోగనిరోధక శక్తి పెరగాలంటే, చింతపండును తీసుకోవడం మంచిది. పైగా, చింతపండులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లెవనాయిడ్స్ తో పాటుగా ఇతర పోషకాలు కూడా ఉంటాయి. ఇవి, రోగ నిరోధక వ్యవస్థని మెరుగు పరుస్తాయి. ఇలా, చింతపండుతో మనం అనేక లాభాలని పొందవచ్చు.

Admin

Recent Posts