హెల్త్ టిప్స్

పురుషులు నిల‌బ‌డి కాదు.. కూర్చునే మూత్ర విస‌ర్జ‌న చేయాలి.. ఎందుకో తెలుసా..?

సాధారణంగా పురుషులు నిలబడి మూత్ర విసర్జన చేస్తూ ఉంటారు. సదుపాయాలు కూడా పెరగడంతో పురుషులు నిలబడి మూత్ర విసర్జన చేస్తున్నారు. కానీ ఇది వరకు రోజుల్లో చూసుకున్నట్లయితే, పురుషులు నిలబడి మూత్రవిసర్జన చేసేవారు కాదు. చాలా మంది అప్పట్లో కూర్చుని మూత్ర విసర్జన చేసేవారు. నిజానికి మగవారు కూర్చుని మూత్ర విసర్జన చేయడం వలన అనేక లాభాలను పొందవ‌చ్చట.

పురుషులు కూర్చుని మూత్ర విసర్జన చేయడం వలన పలు రకాల బెనిఫిట్స్ ని పొందొచ్చు. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. పురుషులు కూర్చుని మూత్ర విసర్జన చేస్తే మంచిది. ముఖ్యంగా ప్రోస్టేట్ సమస్యలు ఉండవు. ఈ సమస్యతో బాధపడుతున్న పురుషులు కూర్చుని మూత్ర విసర్జన చేయడం వలన మూత్రాశయాన్ని సమర్థవంతంగా ఖాళీ చేసేందుకు సహాయపడుతుంది.

men should sit and urinate know why

కూర్చుని పురుషులు మూత్రవిసర్జన చేయడం వలన పెల్విక్ ఫ్లోర్ కండరాలని ఇబ్బందుల్లో పెట్టదు. పురుషులు కూర్చుని మూత్ర విసర్జన చేయడం వలన బ్లాడర్ ఫుల్ గా ఖాళీ అవుతుంది. మగవాళ్ళు కూర్చుని మూత్రవిసర్గం చేయడం వలన బ్లాడర్ బాగా ఖాళీ అవ్వడం వలన యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వంటివి వారి దరి చేరవు. మంచి శృంగార‌ లైఫ్ ని పొందడానికి కూడా ఇది సహాయపడుతుంది.

మగవాళ్ళు కూర్చుని మూత్ర విసర్జన చేయడం వలన ఆరోగ్యానికి ఇన్ని లాభాలు ఉంటాయి. నిలబడి మూత్ర విసర్జన చేయడం వలన యూరిన్ మీద పడే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు కొన్ని రకాల అనారోగ్య సమస్యలు కలిగే ఛాన్స్ ఉంటుంది. అయితే, ఇక్కడ ఆరోగ్య నిపుణులు నిలబడి కంటే కూర్చుని మూత్ర విసర్జన చేయడం మంచిదని చెప్పారు. కానీ ఎవరు వీలుని బట్టి వాళ్ళు మూత్ర విసర్జన చెయ్యచ్చు. ఎక్కువ సేపు టాయిలెట్ లో గడపడం, వాష్ రూమ్ లో కూర్చుని ఫోన్ చూడడం వంటివి అస్సలు మంచిది కాదు.

Admin

Recent Posts