Milk With Cardamom And Dry Ginger : పాల‌లో ఈ రెండూ క‌లిపి తాగండి.. అద్భుతాలు జ‌రుగుతాయి..!

Milk With Cardamom And Dry Ginger : మ‌నం పాల‌ను కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాము. చాలా మంది రోజూ పాల‌ను తాగుతూ ఉంటారు. పాల‌ల్లో ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. పాల‌ను తాగ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. ఎముక‌ల‌ను ధృడంగా ఉంచ‌డంలో, దంతాల‌ను గ‌ట్టిగా చేయ‌డంలో, శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా పాలు మ‌న‌కు దోహ‌ద‌ప‌డ‌తాయి. అయితే ఇలా సాధార‌ణ పాల‌ను తాగ‌డానికి బ‌దులుగా పాల‌ల్లో ఇప్పుడు చెప్పే ప‌దార్థాల‌ను క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌రింత మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. పాలల్లో వీటిని క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌రిన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలను మ‌నం పొంద‌వ‌చ్చ‌ని వారు చెబుతున్నారు.

పాల‌ల్లో క‌లిపి తీసుకోవాల్సిన ఆ రెండు ప‌దార్థాలు ఏమిటి.. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమిటి.. అలాగే ఈ పాల‌ను ఎలా తీసుకోవాలి… అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. సాధార‌ణ పాల‌ను తాగ‌డానికి బ‌దులుగా పాలల్లో శొంఠి, యాల‌కులు క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌రింత మేలు క‌లుగుతుంది. ఇలా పాల‌ల్లో శొంఠి, యాల‌కులు క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. గ్యాస్, క‌డుపు ఉబ్బ‌రం వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. షుగ‌ర్ అదుపులో ఉంటుంది. పాల‌ల్లో శొంఠి, యాల‌కులు క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు ఎల్ల‌ప్పుడూ అదుపులో ఉంటాయి. అలాగే అధిక ర‌క్త‌పోటుతో బాధ‌ప‌డే వారు కూడా ఇలా శొంఠి, యాల‌కులు క‌లిపిన పాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. ర‌క్త‌పోటును అదుపులో ఉంచ‌డంలో ఈ పాలు ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి.

Milk With Cardamom And Dry Ginger many wonderful benefits
Milk With Cardamom And Dry Ginger

అదే విధంగా శొంఠి, యాల‌కులు క‌లిపిన పాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల నీర‌సం, బ‌ల‌హీన‌త వంటి స‌మ‌స్య‌లు మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి. మ‌నం రోజంతా ఉత్సాహంగా ఉండ‌వ‌చ్చు. త‌క్ష‌ణ శ‌క్తిని ఇవ్వ‌డంలో ఈ పాలు మ‌న‌కు ఎంతో దోహ‌ద‌ప‌డ‌తాయి. అలాగే ఈ పాల‌ను తాగ‌డం వ‌ల్ల కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి. ఎముక‌ల‌కు సంబంధించిన స‌మ‌స్యలు రాకుండా ఉంటాయి. అలాగే శొంఠి, యాల‌కులు క‌లిపిన పాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఇన్పెక్ష‌న్ లు, వాతావ‌ర‌ణం మార్పుల వ‌ల్ల వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌లు మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి. ద‌గ్గు, గొంతు నొప్పి, జ‌లుబు వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌ప్పుడు ఇలా పాల‌ల్లో శొంఠి, యాల‌కులు క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది.

ఈ విధంగా శొంఠి, యాల‌కులు క‌లిపిన పాలను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ పాల‌ను ఎలా తీసుకోవాలి…. ఈ పాల‌ను త‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం. ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌ల్లో ఒక టీ స్పూన్ శొంఠి పొడి, ఒక‌టిన్న‌ర టీ స్పూన్ యాల‌కుల పొడి వేసి బాగా క‌లిపి రోజూ రాత్రి ప‌డుకునే ముందు తీసుకోవాలి. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు మ‌న ద‌రి చేర‌కుండా చూసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts