హెల్త్ టిప్స్

Mint Tea : పుదీనా టీని రోజూ తాగుతున్నారా లేదా.. అయితే ఈ రోజే మొద‌లు పెట్టండి..!

Mint Tea : చాలా మంది ఆరోగ్యానికి మేలు చేసే, హెర్బల్ టీ లని తాగుతూ ఉంటారు. మీరు కూడా హెర్బల్ టీ ని తీసుకుంటూ ఉంటారా..? అయితే, ఈ టీ గురించి మీరు కచ్చితంగా చూడాల్సిందే. పుదీనా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పుదీనా వల్ల ఎన్నో లాభాలను పొందొచ్చు. రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. నోటి దుర్వాసనను కూడా పోగొడుతుంది. ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా లాభాలు పుదీనాతో పొందొచ్చు. పుదీనా టీ ని మీరు తీసుకున్నట్లయితే, చక్కటి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

దీని కోసం, పుదీనా ఆకుల్ని కొన్ని తీసుకోండి. అలానే వేడి నీళ్లు, తేనె కూడా తీసుకోండి. ఒక గిన్నెలో కొద్దిగా పుదీనా ఆకుల్ని వేసుకుని, మునిగిపోయే వరకు కూడా వేడి నీళ్ళని పోసేయండి. ఐదు నిమిషాల తర్వాత ఈ నీటిని వడకట్టేసుకోండి. దీనిని మీరు ఎప్పుడైనా సరే తీసుకోవచ్చు. భోజనం తర్వాత, మీరు ఈ టీ ని కనుక తీసుకుంటే, ఆహారం బాగా జీర్ణం అవుతుంది. నిద్రపోవడానికి ముందు, మధ్యాహ్నం పూట అయినా సరే తీసుకోవచ్చు. కొద్దిగా తియ్యగా ఉండాలంటే, కొంచెం తేనెను వేసుకోండి.

mint tea many wonderful health benefits

ఈ పుదీనా టీ ని తీసుకోవడం వలన చక్కటి పోషకాలు అందడమే కాకుండా, ఇంకా ఎన్నో లాభాలని పొందొచ్చు. సైనస్ నుండి ఉపశమనం ని పొందడానికి కూడా ఈ టీ బాగా పని చేస్తుంది. ఈ టీ ని తీసుకోవడం వలన రోగనిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు. చాలామంది బ్యాక్టీరియాల్ ఇన్ఫెక్షన్స్ బారిన పడుతూ ఉంటారు. వాళ్ళు దీన్ని తీసుకుంటే, ఆ సమస్యల నుండి ఈజీగా బయటపడవచ్చు.

నిద్ర పడుతుంది. నిద్ర బాగుంటే, ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈ టీ ని తీసుకుంటే బరువు కూడా ఈజీగా తగ్గొచ్చు. ఎలర్జీలు వంటి బాధల నుండి కూడా బయటపడొచ్చు. తలనొప్పి నుండి కూడా చక్కటి ఉపశమనం కలుగుతుంది. అజీర్తి వంటి సమస్యల నుండి కూడా బయటపడొచ్చు. ఇలా సింపుల్ గా ఆ ఈ టీ ని తయారు చేసుకుని తీసుకుంటే, ఇన్ని బాధల నుండి ఈజీగా బయటకి వచ్చేయొచ్చు.

Share
Admin

Recent Posts