ఆరోగ్యం

Monsoon Foods: వ‌ర్షాకాలంలో ఈ ఆహారాల‌ను క‌చ్చితంగా తీసుకోవాలి.. ఎందుకో తెలుసా ?

Monsoon Foods: వ‌ర్షాకాలం వ‌చ్చిందంటే చాలు అనేక వ్యాధులు మ‌న‌కు వ‌స్తుంటాయి. అవి వ‌చ్చాక బాధ‌ప‌డ‌డం కంటే అవి రాకుండా ముందుగానే జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం అవ‌స‌రం. దోమ‌లు కుట్ట‌డం వ‌ల్ల వ‌చ్చే వ్యాధులు రాకుండా ఉండాలంటే దోమ‌ల‌ను నియంత్రించాలి. అవి లేకుండా, అవి కుట్ట‌కుండా చూసుకుంటే చాలు, ఆ వ్యాధులు రాకుండా ఉంటాయి. అయితే ఇన్‌ఫెక్ష‌న్ల కార‌ణంగా వ‌చ్చే వ్యాధుల‌ను క‌ట్టడి చేసేందుకు, బాక్టీరియా, వైర‌స్‌లు మ‌న‌పై దాడి చేయ‌కుండా ఉండేందుకు గాను శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే ఆహారాల‌ను, మ‌న‌కు పోష‌కాల‌ను అందించే ఆహారాల‌ను తీసుకోవాలి. వ‌ర్షాకాలంలో ఆ ఆహారాల‌ను క‌చ్చితంగా తీసుకోవాలి. దీంతో ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా, సూక్ష్మ క్రిములు దాడి చేయకుండా చూసుకోవ‌చ్చు. మ‌రి ఈ సీజ‌న్‌లో తీసుకోవాల్సిన ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

Monsoon Foods: take these foods in this season for better health

1. చెర్రీలు, నేరేడు పండ్లు, దానిమ్మ పండ్ల‌లో విట‌మిన్ ఎ, సి, ఫైబ‌ర్‌, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి పోష‌కాల‌ను, శ‌క్తిని అందిస్తాయి. వ్యాధులను రాకుండా చూస్తాయి.

2. ఈ సీజ‌న్‌లో ద్ర‌వాహారం ఎక్కువ‌గా తీసుకోవాలి. ముఖ్యంగా సూప్‌లు, మ‌సాలా టీ, గ్రీన్ టీ, ప‌ప్పులు.. వంటి ఆహారాల‌ను తీసుకోవాలి. వీటి వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

3. పొట్లకాయ‌, సొర‌కాయ‌, కాక‌ర‌కాయ వంటి తీగ జాతికి చెందిన కూర‌గాయ‌ల‌తోపాటు తాజా కూర‌గాయ‌లు, ఆకు కూర‌ల‌ను తీసుకోవాలి. దీంతో బాక్టీరియా ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు.

4. పెరుగు, మ‌జ్జిగ‌, పాలు వంటి ప‌దార్థాల‌ను ప్రొ బ‌యోటిక్ ఆహారాల‌ని అంటారు. ఇవి మ‌న శ‌రీరంలోని మంచి బాక్టీరియాకు మేలు చేస్తాయి. అందువ‌ల్ల వీటిని తీసుకుంటే బాక్టీరియా ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా చూసుకోవ‌చ్చు.

5. ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉండే పాలు, పాల ఉత్ప‌త్తులు, పెస‌లు, ప‌ప్పు దినుసులు, రాజ్మా, సోయా, కోడిగుడ్లు, చికెన్ వంటి ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవ‌చ్చు.

6. రోజూ అల్లం ర‌సం, వెల్లుల్లి రెబ్బ‌ల‌ను తీసుకుంటుండాలి. ఇవి జ్వ‌రం, ముక్కు దిబ్బ‌డ‌, వాపులు వంటి ల‌క్ష‌ణాల‌ను త‌గ్గిస్తాయి. వ్యాధుల నుంచి త్వ‌ర‌గా కోలుకుంటారు. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

7. రాత్రి పూట మెంతుల‌ను నీటిలో నాన‌బెట్టి మ‌రుస‌టి రోజు ఉద‌యం ఆ నీటిని తాగ‌డం వ‌ల్ల వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు.

8. రాత్రి పూట పాల‌లో ప‌సుపు క‌లుపుకుని తాగితే అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ముందుగానే జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు.

9. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువ‌గా ఉండే చేప‌లు, రొయ్య‌లు, న‌ట్స్‌, విత్త‌నాలను తీసుకుంటే రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు.

Admin

Recent Posts