హెల్త్ టిప్స్

రోగ నిరోధ‌క శ‌క్తికి, గుండె ఆరోగ్యానికి ఆవ‌నూనె.. ఇంకా ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసుకోండి..!

మ‌న‌కు వాడుకునేందుకు అనేక ర‌కాల నూనెలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఆవ‌నూనె ఒక‌టి. ఇందులో అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి. ఈ నూనెలో ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు ఉంటాయి. ఇత‌ర పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. అందువ‌ల్ల ఆవ‌నూనె మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. దీని వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

mustard oil gives many health benefits

1. ఆవ‌నూనెలో మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను త‌గ్గిస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆవ‌నూనెలో ఆల్ఫా-లినోలీనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది గుండెను సంర‌క్షిస్తుంది.

2. ఆవ‌నూనెలో యాంటీ బాక్టీరియల్‌, యాంటీ ఫంగ‌ల్ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల ఇన్‌ఫెక్ష‌న్ల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. ఈ నూనెలో ఒమెగా 3, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు, విట‌మిన్ ఇ ఉంటాయి. ఇవి మ‌న శ‌రీరానికి ఎంతో అవ‌స‌రం. రోగ నిరోధ‌క శ‌క్తిని ఇవి పెంచుతాయి.

3. ముక్కు దిబ్బ‌డ నుంచి ఆవ‌నూనె వెంట‌నే ఉప‌శ‌మ‌నాన్ని అందిస్తుంది. వెల్లుల్లి రెబ్బ‌ల‌ను ఆవ‌నూనెలో వేసి వేడి చేసి తీసుకుంటే ద‌గ్గు, జ‌లుబు, ముక్కు దిబ్బ‌డ త‌గ్గుతాయి. ఈ నూనెను ముక్కు మీద, పాదాల‌కు, ఛాతికి రాసుకుంటే ఉప‌యోగం క‌లుగుతుంది.

4. మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే అన్ని ర‌కాల కొవ్వులు ఆవ‌నూనెలో ఉంటాయి. దీని వ‌ల్ల జీవక్రియ‌లు స‌క్ర‌మంగా నిర్వ‌ర్తించ‌బ‌డ‌తాయి. ర‌క్తంలోని ప్లాస్మా, ఎర్ర ర‌క్త క‌ణాల‌కు మేలు జ‌రుగుతుంది. ఆవ నూనెను వాడ‌డం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గుతాయి. ఎర్ర ర‌క్త క‌ణాలు ఉత్ప‌త్తి అవుతాయి.

5. ఆవ‌నూనెను వాడ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంద‌ని, హార్ట్ ఎటాక్‌లు రాకుండా నివారించ‌వ‌చ్చ‌ని సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌య‌నాల్లో వెల్ల‌డైంది. గుండె స‌మస్య‌లు ఉన్న‌వారు ఆవ‌నూనెను వాడ‌డం మంచిది. దీని వ‌ల్ల ర‌క్తంలో ట్రై గ్లిజ‌రైడ్లు త‌గ్గుతాయి. హైబీపీ నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. వాపులు త‌గ్గుతాయి.

6. ద‌గ్గు, జ‌లుబు, ఇత‌ర శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించేందుకు ఎంతో పురాత‌న కాలం నుంచే ఆవ‌నూనెను ఉప‌యోగిస్తూ వ‌స్తున్నారు. ఆవ‌నూనెలు మరుగుతున్న నీటిలో వేసి ఆవిరి ప‌డితే శ్వాస కోశ వ్య‌వ‌స్థ శుభ్ర‌మ‌వుతుంది. మ్యూక‌స్ క‌రుగుతుంది. ముక్కు రంధ్రాలు క్లియ‌ర్ అవుతాయి. ముక్కు దిబ్బ‌డ త‌గ్గుతుంది.

7. కొన్ని వెల్లుల్లి రెబ్బ‌లు, వాము గింజ‌ల‌ను తీసుకుని ఆవ‌నూనెలో వేసి వేడి చేయాలి. అనంత‌రం త‌యార‌య్యే మిశ్ర‌మాన్ని పాదాలు, ఛాతికి మ‌ర్ద‌నా చేయాలి. దీని వ‌ల్ల ద‌గ్గు, జ‌లుబు త‌గ్గుతాయి.

8. సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కూడా ఆవ‌నూనె ఎంతో మేలు చేస్తుంది.

9. ఆవ నూనెతో త‌ర‌చూ మ‌ర్ద‌నా చేస్తుంటే కండ‌రాలు, కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి. ఈ నూనెలో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు దృఢంగా ఉండే స్వ‌భావాన్ని త‌గ్గిస్తాయి. దీంతో ఆర్థ‌రైటిస్ నొప్పులు త‌గ్గుతాయి.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts