Onion Juice : ఉల్లిపాయలను మనం సహజంగానే రోజూ వంటల్లో ఉపయోగిస్తుంటాం. ఇవి లేకుండా ఏ వంటకమూ పూర్తి కాదు. కూరల్లో కచ్చితంగా ఉల్లిపాయలను వేస్తాం. అయితే వాస్తవానికి ఆయుర్వేదం ప్రకారం ఉల్లిపాయల్లో అద్భుతమైన ఔషధగుణాలు ఉంటాయి. ఉల్లిపాయల నుంచి రసాన్ని తీసి దాన్ని రోజూ ఉదయం పరగడుపునే 30 ఎంఎల్ మోతాదులో తాగుతుంటే అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. అధిక బరువు సమస్యతో బాధపడుతున్నవారు 30 ఎంఎల్ ఉల్లిపాయల రసంలో ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి ఉదయాన్నే పరగడుపునే తాగాలి. ఇలా క్రమం తప్పకుండా రోజూ చేస్తుంటే అధిక బరువు తగ్గిపోతారు. శరీరంలోని కొవ్వు కరుగుతుంది.
2. ఉల్లిపాయల రసంలో విటమిన్ సి, జింక్, ఫైటో కెమికల్స్ సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల వీటి రసాన్ని తాగితే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు, జ్వరం, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.
3. రాత్రి పూట ఒక గ్లాస్ నీటిలో కొన్ని ఉల్లిపాయ ముక్కలను చిన్నగా కట్ చేసి వేసి రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఆ నీటిని కొద్ది కొద్దిగా తాగుతుండాలి. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
4. ఉల్లిపాయల రసాన్ని జుట్టుకు తరచూ రాస్తుండాలి. ఒక గంట సేపు అయ్యాక తలస్నానం చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే శిరోజాల సమస్యలు తగ్గుతాయి. జుట్టు దృఢంగా, ఒత్తుగా పెరుగుతుంది. కాంతివంతంగా మారి మెరుస్తుంది. చుండ్రు సమస్య తగ్గుతుంది.
5. మొటిమలు, మచ్చలు ఉన్నచోట ఉల్లిపాయల రసాన్ని రాస్తుండాలి. కళ్ల కింద నల్లని వలయాలను కూడా ఈ రసం తగ్గిస్తుంది. రాత్రి పూట ఈ రసాన్ని రాసి ఉదయం కడిగేస్తుండాలి. దీంతో ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు.
6. ఉల్లిపాయల్లో అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. డయాబెటిస్ రాకుండా చూస్తాయి. డయాబెటిస్ ఉన్నవారిలో షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి.
7. ఎముకలు బలహీనంగా ఉన్నవారు, జీర్ణ సమస్యలు ఉన్నవారు రోజూ పచ్చి ఉల్లిపాయలను 30 గ్రాముల మేర తింటున్నా లేదా జ్యూస్‌ను తాగుతున్నా.. ఆయా సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు.
8. ఉల్లిపాయల రసాన్ని పురుషులు రోజూ తాగడం వల్ల వారిలో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. వీర్యం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. సంతానం కలిగే అవకాశాలు మెరుగు పడతాయి.