Fridge : వీటిని ఎట్టి పరిస్థితిలోనూ ఫ్రిజ్‌లో పెట్టకూడదు.. అవేమిటంటే..?

Fridge : ఒకప్పుడు చాలా మందికి ఫ్రిజ్ లు ఉండేవి కావు. దీంతో కూరగాయలు, పండ్లు, ఆహారాలను నిల్వ చేయడం ఇబ్బందిగా ఉండేది. కానీ ఇప్పుడు దాదాపుగా అందరి ఇళ్లలోనూ ఫ్రిజ్‌లు ఉంటున్నాయి. దీంతో అనేక రకాల పదార్థాలను అందులో నిల్వ చేస్తున్నారు. అయితే కొన్నింటిని మాత్రం ఫ్రిజ్‌లలో నిల్వ చేయరాదు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

do not store these items in Fridge

1. ఉల్లిపాయలను ఫ్రిజ్‌లో నిల్వ చేయడం వల్ల అవి మృదువుగా మారుతాయి. పైన తేమ చేరుతుంది. దీంతో అవి త్వరగా బూజు పట్టేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఇతర కూరగాయల నుంచి వేరు చేసి వాటిని వేరే చోట నిల్వ చేయాలి. లేదంటే వాటి నుంచి వచ్చే వాసనకు కూరగాయలు పాడవుతాయి. కనుక ఉల్లిపాయలను ఇతర వాటికి దూరంగా ఉంచాలి. అలాగే వాటిని ఫ్రిజ్‌లో పెట్టరాదు.

2. అరటి పండ్లకు సహజసిద్ధమైన రుచి ఉంటుంది. వీటిని ఫ్రిజ్‌లో నిల్వ చేసే ఆ రుచి పోతుంది. అలాగే అరటి పండ్లలో ఉండే పొటాషియం తగ్గిపోతుంది. అందువల్ల అరటి పండ్లను ఎల్లప్పుడూ గది ఉష్ణోగ్రత వద్దే నిల్వ ఉంచాలి.

3. బంగాళాదుంపలను కూడా ఫ్రిజ్‌లో పెట్టరాదు. పెడితే వాటి సహజసిద్ధమైన రుచి పోతుంది. ఎక్కువ రోజుల పాటు ఫ్రిజ్‌లో ఉంచితే వాటిల్లో ఉండే పిండి పదార్థం మరింత తియ్యగా మారుతుంది. అలాంటి బంగాళాదుంపలను అస్సలు తినరాదు. కనుక బంగాళాదుంపలను కూడా గది ఉష్ణోగ్రత వద్దే నిల్వ ఉంచాలి. ఫ్రిజ్‌లో పెట్టకూడదు.

4. టమాటాలను ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల రుచిని కోల్పోవడమే కాక, ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్‌ వచ్చే అవకాశం ఉంటుంది. కనుక వీటిని కూడా బయటే నిల్వ చేయాలి.

5. ఆలివ్‌ ఆయిల్‌ ను కూడా ఫ్రిజ్‌లో పెట్టరాదు. పెడితే హానికారక క్రిములు అందులో చేరుతాయి. కనుక దీన్ని గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాల్సి ఉంటుంది.

Share
Admin

Recent Posts