హెల్త్ టిప్స్

జీర్ణకోశ సమస్య రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు..!

తీవ్రమైన కడుపు నొప్పి, బరువు తగ్గడం, ఛాతీలో మంట, మలబద్దకం, మలంలో రక్తం పడడం, పైల్స్‌, వాంతులు, వికారం, ట్రావెలర్స్ డయోరియా, చిన్నపిల్లల్లో అజీర్తి, జీర్ణాశయం, పేగు ఇన్‌ఫెక్షన్, పేగులో అల్సర్ ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ని కలవడం అవసరం. జీర్ణకోశ సమస్యలు వచ్చుటకు కారణాలు.. కొన్ని రకాల మందులు వాడుట వలన ఈ సమస్య ఏర్పడును. ద్రవపదార్థాలను, పీచు ఉన్న ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల కూడా జీర్ణకోశ సమస్య వచ్చును. విరేచనానికి నియమిత సమయాన్ని కేటాయించకపోవడం, తరచుగా ఫ్రీ మోషన్ కోసం మందులు వాడడం వల్ల కూడా ఈ సమస్య తలెత్తును.

జీర్ణకోశ సమస్య నివారణ చేసే విధానం.. గోధుమలు, ముడి బియ్యం ఎక్కువగా తీసుకోవడం మంచిది. రోజుకు కనీసం మూడు లీటర్ల నీటిని, ఇతర ద్రవపదార్థాలను తీసుకోవాలి. యోగ, నడక, వ్యాయామం, ధ్యానం, సరైన నిద్రను పాటించాలి.

people who have digestive system problem must follow these

మొలకలు, క్యారట్, గ్రీన్ సలాడ్, క్యాప్సికం, కీర, ముల్లంగి వంటి పచ్చి కూరగాయలు, పీచు ఎక్కువగా ఉండే ఆహారాన్ని, ఆకుకూరలు, పండ్లను తీసుకోవడం మంచిది.

Admin

Recent Posts