హెల్త్ టిప్స్

Pista Boiled In Milk : పాల‌లో వీటిని వేసి మ‌రిగించి తాగండి.. ఎన్నో లాభాలు ఉంటాయి..!

Pista Boiled In Milk : ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటుంటారు. ఆరోగ్యం బాగుండాలంటే మంచి ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. పిస్తా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. చాలా మంది ప్రతిరోజూ జీడిపప్పు, బాదంపప్పు, పిస్తా మొదలైన డ్రై ఫ్రూట్స్ ని తీసుకుంటూ ఉంటారు. పిస్తాతో ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. డయాబెటిస్ తో చాలా మంది బాధపడుతున్నారు. అటువంటి వాళ్లకి పిస్తా ఎంతో చక్కగా పనిచేస్తుంది.

చాలామంది డయాబెటిస్ తో బాధపడుతున్నారు. చిన్న వయసు వాళ్ళు కూడా డయాబెటిస్ తో సతమతమవుతున్నారు. డయాబెటిస్ ఒకసారి వస్తే జీవితాంతం మందులను ఉపయోగించాల్సి ఉంటుంది. మందుల‌ని ఉపయోగిస్తే డయాబెటిస్ ని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. కానీ ఆహార పదార్థాల ద్వారా కూడా కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. పిస్తా డయాబెటిస్ ని బాగా కంట్రోల్ చేస్తుంది.

pista milk many wonderful health benefits

నానబెట్టుకుని చాలామంది డ్రై ఫ్రూట్స్ ని తింటూ ఉంటారు. కానీ పాలలో ఉడికించుకుని తీసుకోవడం వలన చక్కటి ప్రయోజనాలు ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవాళ్లు ఇలా తీసుకోవడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్‌లో ఉంటాయి. దీనికోసం పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి అందులో పాలు పోయాలి. పాలు కాస్త వేడి అయిన తర్వాత పిస్తా పప్పుల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. దీనిని మీరు ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది.

పిస్తాతోపాటు ఈ పాలను కూడా తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వలన డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది. శరీరానికి అవసరమైన ప్రోటీన్ అందుతుంది. కండరాలకు బలం వస్తుంది. పిస్తా పప్పులో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. దీన్ని తీసుకుంటే ఎముకలని దృఢంగా వుంచుకోవచ్చు.

కీళ్లు దృఢంగా ఉంటాయి. కీళ్ల నొప్పులు ఉన్నవాళ్లు ప్రతిరోజూ దీనిని తీసుకోవడం వలన చక్కటి ప్రయోజనం ఉంటుంది. కంటికి సంబంధించిన సమస్యలు కూడా ఉండవు. ఈ రోజుల్లో చాలామంది ఫోన్లని ఎక్కువగా వాడుతున్నారు. దానితో కంటి సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి సమస్యలు అన్నింటికీ కూడా పిస్తా పాలు సహాయం చేస్తాయి.

Admin

Recent Posts