Pomegranate And Papaya : రోజూ బొప్పాయి, దానిమ్మ పండ్ల‌ను క‌లిపి తింటే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Pomegranate And Papaya : మ‌నం ఆహారంగా తీసుకునే పండ్ల‌ల్లో దానిమ్మ పండు కూడా ఒక‌టి. దానిమ్మ పండు చాలా రుచిగా ఉంటుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. దానిమ్మ‌కాయ‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. అ విష‌యం మ‌నంద‌రికి తెలిసిందే. అలాగే మ‌నం ఆహారంగా తీసుకునే ఇత‌ర పండ్ల‌ల్లో బొప్పాయి కూడా ఒక‌టి. బొప్పాయి పండు కూడా తియ్య‌గా చాలా రుచిగా ఉంటుంది. ఇది కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ రెండు పండ్లల్లో కూడా అనేక పోషకాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. మ‌నం ఈ రెండు పండ్ల‌ను కూడా విడివిడిగా తీసుకుంటూ ఉంటాము.

ఇలా విడివిడిగా కాకుండా ఈ రెండు పండ్ల‌ను క‌లిపి జ్యూస్ గా చేసి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం మ‌రిన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. దానిమ్మ‌, బొప్పాయి ఇవి రెండు కూడా మన ఆరోగ్యానికి మేలు చేసేవే. వీటిని క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. దానిమ్మ పండు, బొప్పాయి పండుతో జ్యూస్ ను ఎలా త‌యారు చేసుకోవాలి…అలాగే ఈ జ్యూస్ ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఏమిటి…అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

Pomegranate And Papaya many wonderful health benefits
Pomegranate And Papaya

ఈ జ్యూస్ ను త‌యారు చేసుకోవ‌డానికి గానూ ముందుగా ఒక క‌ప్పు బొప్పాయి ముక్క‌లు, ఒక చిన్నక్యారెట్ ముక్క‌లు, ఒక దానిమ్మ‌కాయ గింజ‌లు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఇందులో పావు టీ స్పూన్ ప‌సుపు, ఒక గ్లాస్ నీళ్లు పోసి మ‌రోసారి మిక్సీ ప‌ట్టుకుని గ్లాస్ లో పోసుకుని తాగాలి. ఇలా దానిమ్మ‌కాయ‌, బొప్పాయి పండ్ల‌తో జ్యూస్ ను త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల ఎముకలు ధృడంగా త‌యార‌వుతాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. అలాగే ఈ జ్యూస్ ను తాగ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. రక్త‌హీన‌త స‌మ‌స్య త‌గ్గుతుంది. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఇన్ఫెక్ష‌న్ లు మ ద‌రి చేర‌కుండా ఉంటాయి.

అలాగే జీర్ణ‌శ‌క్తి పెరుగుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం, అజీర్తి, గ్యాస్ వంటి స‌మ‌స్య‌లు మ‌న ద‌రి చేరుకుండా ఉంటాయి. అలాగే ఆస్థ‌మా వంటి శ్వాస‌కోస సంబంధిత స‌మ‌స్యల నుండి కూడా ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. అంతేకాకుండా దానిమ్మ‌, బొప్పాయిని క‌లిపి ఈ విధంగా జ్యూస్ చేసి తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త‌పోటు అదుపులో ఉంటుంది. జుట్టు రాల‌డం త‌గ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అలాగే చ‌ర్మ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. వృద్దాప్య ఛాయ‌లు మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి. సుల‌భంగా బ‌రువు కూడా త‌గ్గ‌వ‌చ్చు. ఈ విధంగా బొప్పాయిని, దానిమ్మ గింజ‌ల‌ను క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts