Ponnaganti Aaku For Gas Trouble : మనకు పొలాల దగ్గర గట్ల మీద, కాలువల్లో సులభంగా లభించే ఆకుకూరల్లో పొన్నగంటి కూర కూడా ఒకటి. ఈ మధ్యకాలంలో ఇది మార్కెట్ లో కూడా విరివిగా లభిస్తుంది. చాలా మంది తక్కువ మంది మాత్రమే పొన్నగంటి కూరను ఆహారంగా తీసుకుంటున్నారు. కానీ ఇతర ఆకుకూరల వలె పొన్నగంటి కూరను కూడా ఆహారంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దీనిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. 100 గ్రాముల పొన్నగంటి కూరలో 500 మిల్లీ గ్రాముల క్యాల్షియం ఉంటుంది. పాలల్లో కంటే 4 రెట్లు ఎక్కువ క్యాల్షియం పొన్నగంటి కూరలో ఉంటుంది. అలాగే దీనిలో లవణాలు ఎక్కువగా ఉంటాయి.
పొన్నగంటి కూరను తీసుకోవడం వల్ల ముఖ్యంగా పొట్టలో గ్యాస్ సమస్య తగ్గుతుంది. కొందరికి పొట్టలో అవసరానికి మించి ఎక్కువగా యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. ఇలా యాసిడ్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల పొట్టలో ఎల్లప్పుడూ ఇబ్బందిగా ఉంటుంది. దీని కారణంగా గొంతులో మంట, పుల్లటి త్రేన్పులు రావడం వంటిఇతర సమస్యలు కూడా తలెత్తుతాయి. ఈ సమస్య నుండి బయటపడడానికి చాలా మంది యాంటాసిడ్స్ ను వాడుతూ ఉంటారు. వీటిని వాడడం వల్ల యాసిడ్ తక్కువగా ఉత్పత్తి అవుతుంది. అయితే ఇలా మందులు వాడడానికి బదులుగా పొన్నగంటి కూరను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీనిలో ఉండే మినరల్స్ యాసిడ్ రిఫ్లెక్షన్ తగ్గించడంలో ఎంతగానో సహాయపడతాయని నిపుణులు పరిశోధనల ద్వారా తెలియజేసారు. అంతేకాకుండా పొన్నగంటి కూరలో ప్లేవనాయిడ్స్, నానో సిల్వర్ ఆయాన్స్ ఉంటాయి.
ఇవి కాలేయంలో జరిగే డిటాక్సిఫికేష్ ప్రక్రియ సమయంలో విడుదలయ్యే ఫ్రీరాడికల్స్ ను తొలగించడంలో దోహదపడతాయి. ఫ్రీరాడికల్స్ తొలగించడం వల్ల మనం క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఉంటాము. ఈ విధంగా పొన్నగంటి కూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని దీనిని కనీసం వారానికి రెండు నుండి మూడు సార్లు తీసుకునే ప్రయత్నం చేయాలని నిపుణులు చెబుతున్నారు. పొన్నగంటి కూరను నేరుగా వండుకోవడంతో పాటు ఇతర ఆకుకూరలతో కూడా కలిపి వండుకోవచ్చు. కూరగాయల కంటే ఆకుకూరలె మన ఆరోగ్యానికి మరింత మేలు చేస్తాయని ఆకుకూరలనే ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.