Purple Color Foods : మనం రోజూ పాటించే జీవనశైలి కారణంగానే మనకు అనేక వ్యాధులు వస్తుంటాయి. ముఖ్యంగా మనం రోజూ తినే ఆహారం చాలా వరకు వ్యాధులకు కారణమవుతుంది. అలాగే శారీరక శ్రమ చేయకపోవడం, తగినన్ని గంటల పాటు నిద్రించకపోవడం, సరిగ్గా నీళ్లు తాగకపోవడం.. వంటి కారణాల వల్ల కూడా మనం రోగాల బారిన పడుతుంటాం. అయితే వాస్తవానికి ఈ అలవాట్లు అన్నీ శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోయేలా చేస్తాయి. దీని వల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతుంది. ఫలితంగా హార్ట్ ఎటాక్ వస్తుంది. అయితే ఇలా జరగకుండా ఉండాలంటే మనం రక్తనాళాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఇందుకు గాను మనకు పలు ఆహారాలు ఉపయోగపడతాయి. వీటిని తరచూ తినడం వల్ల రక్తనాళాలు క్లీన్ అవుతాయి. దీంతో హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు. ఇక ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మనకు అనేక రకాల రంగుల ఆహారాలు లభిస్తుంటాయి. అయితే రక్తనాళాల్లో ఉండే కొవ్వు కరగాలంటే మాత్రం మనం పర్పుల్ కలర్‌లో ఉండే ఆహారాలను తినాలి. వీటిని తింటే కొలెస్ట్రాల్ అన్నది ఉండదు. ఇక అలాంటి వాటిల్లో బ్లూబెర్రీలు ముఖ్యమైనవి. ఇవి పర్పుల్ కలర్‌లో చూసేందుకు అంత ఆకర్షణీయంగా ఉండవు. కానీ వీటిని రోజూ తింటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. బ్లూబెర్రీలను తినడం వల్ల వాటిల్లో ఉండే ఫ్లేవనాయిడ్స్ మన గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. రక్తనాళాల్లో ఉండే కొవ్వును కరిగిస్తాయి. దీంతోపాటు హైబీపీ కూడా తగ్గుతుంది. శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది.
బ్లాక్ బెర్రీలు కూడా పర్పుల్ కలర్ ఫుడ్స్ కిందకే వస్తాయి. వీటిని తింటే మనకు ఫైబర్, విటమిన్ సి, యాంథో సయనిన్స్ లభిస్తాయి. ఇవి కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. దీంతో రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. హార్ట్ ఎటాక్ రాదు. ద్రాక్ష పండ్లు కూడా కొన్ని పర్పుల్ కలర్‌లోనే ఉంటాయి. పర్పుల్ కలర్‌లో ఉండే ద్రాక్షల్లో రెస్వెరెట్రాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది వాపులను తగ్గించి శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి.
ప్లమ్స్‌లో విటమిన్ సితోపాటు పొటాషియం అధికంగా ఉంటుంది. అందువల్ల ఈ పండ్లను తింటే హైబీపీ తగ్గుతుంది. శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే వంకాయలను కూడా తినవచ్చు. గుండెకు ఇవి కూడా ఎంతో మేలు చేస్తాయి. వంకాయల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది గుండె పనితీరును మెరుగు పరుస్ఉతంది. అలాగే వీటిల్లో ఉండే యాంథో సయనిన్లు గుండె జబ్బులు రాకుండా చూస్తాయి.
ప్రూన్స్ మనకు ఎక్కువగా మార్కెట్‌లో డ్రై ఫ్రూట్స్ రూపంలో లభిస్తాయి. వీటిల్లోనూ ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించి జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. అలాగే గుండెను సంరక్షిస్తుంది. అందువల్ల ఈ ఆహారాలను మనం తరచూ తింటుంటే రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. రక్తనాళాలు క్లీన్ అవుతాయి. దీంతో హార్ట్ ఎటాక్, ఇతర గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. కనుక ఈ ఆహారాలను రోజూ తీసుకోండి.