Mushroom Noodles : బయట బండ్లపై మనం రకరకాల చిరుతిండ్లను తింటుంటాం. కొందరు చైనీస్ ఫాస్ట్‌ఫుడ్‌ను తింటారు. అయితే ఫాస్ట్‌ఫుడ్ అనగానే చాలా మందికి నూడుల్స్ గుర్తుకు వస్తాయి. నూడుల్స్‌ను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. కానీ ఈ రోజుల్లో బయట లభించే ఆహారాలను మనం నమ్మలేకుండా ఉన్నాము. కనుక ఏం తిన్నా కూడా ఇంట్లోనే తయారు చేసి తినడం ఉత్తమం. ఇక నూడుల్స్‌లో పుట్టగొడుగులను వేసి ఎంతో అద్భుతంగా తయారు చేసుకోవచ్చు. ఈ మష్రూమ్ నూడుల్స్‌ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇక ఈ నూడుల్స్‌ను ఎలా తయారు చేయాలో, వీటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
నూడుల్స్ – 200 గ్రాములు, మష్రూమ్స్ – 300 గ్రాములు, తరిగిన వెల్లుల్లి ముక్కలు – అర టేబుల్ స్పూన్, తరిగిన అల్లం – అర టీస్పూన్, తరిగిన పచ్చి మిర్చి – 1 టీస్పూన్, నల్లమిరియాలు – అర టీస్పూన్, తరిగిన ఉల్లికాడలు – అర కప్పు, తరిగిన కొత్తిమీర – అర టీస్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్లు, సోయా సాస్ – 1 టేబుల్ స్పూన్, వెనిగర్ – 1 టీస్పూన్, గార్నిష్ చేసేందుకు ఉల్లికాడలు, ఉప్పు – తగినంత.
నూడుల్స్‌ను ముందుగా ఉడకబెట్టి నీటిని వంపేసి పక్కన పెట్టాలి. అనంతరం కడాయి తీసుకుని అందులో నూనె వేసి వేడి చేయాలి. స్టవ్ ను మీడియం మంటపై పెట్టి కడాయిలో తరిగిన వెల్లుల్లి, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిర్చి వేయాలి. మీరు నూడుల్స్ స్పైసీగా కావాలనుకుంటే ఇంకాస్త పచ్చిమిర్చి ముక్కలను వేయవచ్చు. తరువాత వాటిని కాసేపు వేయించాలి. అనంతరం తరిగిన ఉల్లికాడలను వేయాలి. వాటిల్లో కొన్నింటిని గార్నిష్ కోసం పక్కన పెట్టుకోవాలి. తరువాత అన్నింటినీ బాగా వేయించాక మష్రూమ్స్‌ను వేయాలి. వాటిని కూడా మీడియం లేదా హై ఫ్లేమ్‌పై కాసేపు వేయించాలి. దీంతో మష్రూమ్స్ నుంచి నీళ్లు బయటకు వస్తాయి.
మష్రూమ్స్‌లో ఉండే నీళ్లు అన్నీ పోయే వరకు వేయించాలి. దీంతో అవి లేత బంగారు రంగులోకి మారుతాయి. అప్పుడు మిరియాలను వేయాలి. అందులోనే సోయా సాస్ వేసి బాగా కలపాలి. తరువాత నూడుల్స్‌ను వేసి ఉప్పును రుచికి సరిపడా వేసుకోవాలి. తరువాత నూడుల్స్‌ను బాగా కలపాలి. అనంతరం వెనిగర్ వేసి బాగా కలపాలి. తరువాత కాసేపు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. చివర్లో గార్నిష్ కోసం పక్కన పెట్టిన ఉల్లికాడలను వేసి అలంకరించుకోవాలి. అనంతరం మళ్లీ ఒకసారి కలుపుకోవాలి. దీంతో ఎంతో రుచిగా ఉండే మష్రూమ్ నూడుల్స్ రెడీ అవుతాయి. వీటిని నేరుగా అలాగే తినవచ్చు లేదా వేడి వేడి గార్లిక్ సాస్‌తోనూ తినవచ్చు. ఎంతో టేస్టీగా ఉంటాయి. అందరూ వీటిని ఎంతో ఇష్టంగా తింటారు.