భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి ఉల్లిపాయలను ఔషధంగా వాడుతున్నారు. అయితే ప్రస్తుతం చాలా మంది సైన్స్‌ను విశ్వసిస్తున్నారు. ఈ క్రమంలోనే సైన్స్ కూడా ఉల్లిపాయల వల్ల ప్రయోజనాలు కలుగుతాయని చెబుతోంది. ఈ క్రమంలోనే నిద్రించే సమయంలో పక్కన ఉల్లిపాయను పెట్టుకుని నిద్రించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
రాత్రి నిద్రించేటప్పుడు పక్కన ఒక ఉల్లిపాయను నాలుగు భాగాలుగా కట్ చేసి పెట్టుకోవాలి. దీని వల్ల జలుబు, దగ్గు సమస్యలు తగ్గుతాయి. ఉల్లిపాయల్లో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. అందువల్లే ఇది సాధ్యమవుతుంది. ఒకప్పుడు మన పెద్దలు కూడా ఇద్దే పద్ధతిని అనుసరించేవారు. దీని వల్ల ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. నిద్ర చక్కగా పడుతుంది.
ఉల్లిపాయలను కట్ చేసి దగ్గర పెట్టుకోవడం వల్ల దోమలు, పురుగులు, ఇతర కీటకాలు రాకుండా ఉంటాయి. ఉల్లిపాయలను కట్ చేసి సాక్సుల్లో వేసి వాటిని పాదాలకు ధరించాలి. రాత్రంతా వాటిని అలాగే ఉంచాలి. ఇలా చేయడం వల్ల పాదాలు డిటాక్స్ అవుతాయి. దీంతో పాదాల్లో రక్త సరఫరా మెరుగు పడుతుంది.
ఉల్లిపాయల్లో సల్ఫర్ అధికంగా ఉంటుంది. ఇది వెంట్రుకలను సంరక్షిస్తుంది. ఉల్లిపాయల పేస్ట్‌ను జుట్టుకు బాగా పట్టించి తరువాత కొంత సేపు ఆగి స్నానం చేయాలి. తరచూ ఇలా చేయడం వల్ల వెంట్రుకల సమస్యలు పోతాయి. చుండ్రు తగ్గుతుంది. చర్మానికి ఉల్లిపాయల గుజ్జు రాయడం వల్ల చర్మం సురక్షితంగా ఉంటుంది. దుస్తులపై ఏర్పడే మరకలను పోగొట్టడంలోనూ ఉల్లిపాయల గుజ్జు పనిచేస్తుంది. బేకింగ్ సోడా, ఉల్లిపాయల రసం కలిపి గ్లాస్ కిటికీలను శుభ్రపరిస్తే తళతళా మెరుస్తాయి. ఆ ప్రాంతంలో బాక్టీరియా రాకుండా ఉంటుంది.