3 రోజులు వ‌రుస‌గా ఖాళీ క‌డుపుతో వాము నీళ్ల‌ను తాగండి.. ఈ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి..

దాదాపుగా మ‌న అంద‌రి ఇళ్ల‌లోనూ వంటి ఇంటి పోపు దినుసుల డ‌బ్బాలో వాము ఉంటుంది. దీని గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇది చ‌క్క‌ని రుచిని, సువాస‌న‌ను క‌లిగి ఉంటుంది. అందువ‌ల్ల దీన్ని అనేక వంట‌కాల్లో వాడుతుంటారు. వాము వంట‌కాల‌కు హాట్ రుచిని అందిస్తుంది. దీన్ని నిత్యం వంట‌ల్లో ఉప‌యోగించ‌వ‌చ్చు. లేదా పొడి చేసుకుని భోజ‌నం స‌మ‌యంలో ఇత‌ర ఆహారాలతో క‌లిపి తీసుకోవ‌చ్చు. వాము నోటి దుర్వాస‌న‌ను తొల‌గిస్తుంది. అందువ‌ల్ల భోజ‌నం చేసిన వెంట‌నే వామును న‌మిలితే ప్ర‌యోజ‌నం ఉంటుంది. అయితే దీన్ని పొడి రూపంలో క‌న్నా నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో క‌లిపి తీసుకుంటే ఇంకా ఎక్కువ ఉప‌యోగాలు ఉంటాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

wonderful health benefits of drinking ajwain water

1. రోజూ ప‌ర‌గ‌డుపునే వాము నీటిని తాగడం వ‌ల్ల గుండెల్లో మంట‌, అసిడిటీ, అజీర్ణం వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. జీర్ణాశ‌యంలో ఉండే అసౌక‌ర్యం తొల‌గిపోతుంది. శ‌రీర మెట‌బాలిజం పెరుగుతుంది. ఆక‌లి లేని వారు ఈ నీటిని తాగితే ఆక‌లి పెరుగుతుంది.

2. వాము నీటిని తాగ‌డం వ‌ల్ల జీర్ణ‌క్రియ‌లో వేగం పెరుగుతుంది. ఈ క్ర‌మంలో శ‌రీరంలో ఉండే వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు పోతాయి. బ‌రువు పెర‌గ‌కుండా ఉంటారు. బ‌రువు త‌గ్గేందుకు ఇది ఎంత‌గానో స‌హాయ ప‌డుతుంది.

3. సీజ‌న‌ల్‌గా వ‌చ్చే జ‌లుబు, ఫ్లూ వంటి వ్యాధుల‌ను త‌గ్గించేందుకు వాము నీళ్లు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఈ నీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విట‌మిన్ సి రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. దీని వ‌ల్ల సీజ‌న‌ల్ వ్యాధులు రాకుండా ఉంటాయి.

4. వాము నీటిని తాగడం వల్ల శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. హైబీపీ తగ్గుతుంది. గుండె జబ్బులు రాకుండా నివారించవచ్చు.

5. వాములో యాంటీ బాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌ లక్షణాలు ఉంటాయి. అందువల్ల బాక్టీరియా, ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్లు తగ్గిపోతాయి.

6. కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ ఎక్కువగా ఉన్నవారు రోజూ వాము నీటిని తాగడం వల్ల ఎంతో ఫలితం ఉంటుంది. కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ తగ్గుతాయి. రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. హార్ట్‌ ఎటాక్‌లు రాకుండా నివారించవచ్చు.

7. దగ్గు సమస్య ఉన్నవారు వాము నీళ్లను తాగితే ఎంతో ఫలితం ఉంటుంది. ఉదయం, సాయంత్రం ఒక కప్పు మోతాదులో వాము నీళ్లను తాగవచ్చు.

8. వాము నీళ్లను తాగడం వల్ల జీర్ణాశయంలో ఉండే అల్సర్లు తగ్గిపోతాయి. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది.

రోజూ ప‌ర‌గ‌డుపునే గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో 1 టీస్పూన్ వాము పొడిని క‌లుపుకుని తాగ‌వ‌చ్చు. లేదా 2 టీస్పూన్ల వామును రాత్రి పూట నీటిలో నాన‌బెట్టి మ‌రుస‌టి రోజు ఆ నీటిని అలాగే మ‌రిగించి, వ‌డ‌క‌ట్టి తాగ‌వ‌చ్చు. ఎలా తాగినా ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.

 

Share
Admin

Recent Posts