Ragi Java And Oats : నేటితరుణంలో మనలో చాలా మంది రోజూ ఆహారంలో భాగంగా ఓట్స్ ను అలాగే రాగి జావను తీసుకుంటూ ఉన్నారు. ఇవి రెండు కూడా మన ఆరోగ్యానికి మేలు చేసేవే. చాలా మంది ఉదయం అల్పాహారంలో భాగంగా ఓట్స్ ను పాల్లలో కలిపి తీసుకుంటున్నారు. రాగి జావను కూడా రోజూ తాగుతున్నారు. అయితే ఇలా రోజూ ఓట్స్ ను, రాగి జావను తీసుకోవడం మంచిదేనా.. వీటిని రోజూ తీసుకోవడం వల్ల ఎలాంటి ఫలితం ఉంటుంది.. దీని గురించి నిపుణులు ఏమంటున్నారు.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఓట్స్ గురించి తెలుసుకుందాం. ఓట్స్ కూడా మనం ఆహారంగా తీసుకునే ధాన్యాల్లో ఒకటి. చాలా మంది ఉదయం పూట ఇడ్లీ, దోశ వంటి వాటికి బదులుగా పాలల్లో ఓట్స్ ను కలిపి తీసుకుంటున్నారు. ఇలా తీసుకోవడం వల్ల ఉప్పు, నూనె, మసాలా వంటి పదార్థాలు మన శరీరంలోకి వెళ్లకుండా ఉంటాయి.
అలాగే ఇడ్లీ, దోశ వంటి అల్పాహారాలను తీసుకున్నప్పుడు శరీరం బద్దకంగా ఉంటుంది. కానీ ఓట్స్ ను తీసుకోవడం వల్ల శరీరం తేలికగా ఉంటుంది. అలాగే ఓట్స్ ను తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. పొట్టకు తేలికగా ఉంటుంది. అలాగే ఇతర అల్పాహారాలను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. కానీ ఓట్స్ ను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అలాగే ఓట్స్ ను ఇన్ స్టాంట్ గా అప్పటికప్పుడు తయారు చేసి తీసుకోవచ్చు. ఈ విధంగా ఓట్స్ మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే వీటిని రోజూ తీసుకోవడం అంత మంచిది కాదు. ఓట్స్ ను తీసుకోవడం శరీరానికి కావల్సిన పోషకాలు అన్ని కూడా అందవు.
వీటిని పొట్టలో ఇబ్బందిగా ఉన్నప్పుడు, గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలు ఇబ్బంది పెడుతున్నప్పుడు, ఆరోగ్యం అంతగా బాగోలేనప్పుడు, అలాగే సమయం తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఓట్స్ ను ఆహారంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఓట్స్ ను తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత ప్రోటీన్ అందదు. రోజూ ఓట్స్ కు బదులుగా మొలకెత్తిన గింజలను తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఓట్స్ ను అప్పుడప్పుడూ మాత్రమే తీసుకోవాలని వారు చెబుతున్నారు. ఓట్స్ ను తీసుకోవడం వల్ల ఎటువంటి నష్టం లేనప్పటికి లాభాలు మాత్రం ఎక్కువగా ఉండవని వారు చెబుతున్నారు. ఇక రాగి జావ విషయానికి వస్తే రాగి జావ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే రాగి జావను తీసుకోవడం వల్ల శరీరంలోకి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా వెళ్తాయని దీంతో అనేక అనారోగ్య సమస్యలు తలెతుత్తాయని నిపుణులు చెబుతున్నారు.
మనలో చాలా మంది ఉదయం పూట అల్పాహారాలను, మధ్యాహ్నం, సాయంత్రం అన్నాన్ని తీసుకుంటూ మరలా జావను తీసుకుంటున్నారు. ఇలా తీసుకోవడం వల్ల శరీరానికి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా అందుతాయి. దీంతో ఊబకాయం, కొలెస్ట్రాల్, షుగర్ వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. పూర్వకాలంలో ఆహారం సరిగ్గా లేనిరోజుల్లో రాగి జావను ఆహారంగా తీసుకునే వారు. కానీ ఈ రోజుల్లో చాలా మందికి ఆహారం లోటు లేకుండా ఉంది. కనుక రాగి జావకు బదులుగా పండ్ల రసాలను తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా ఓట్స్, రాగిజావ మన ఆరోగ్యానికి మేలు చేసేవే అయినప్పటికి వీటిని రోజూ తీసుకోవడం అంత మంచిది కాదని నిపుణులు తెలియజేస్తున్నారు.