Red Rice Benefits : రోజూ క‌ప్పు చాలు.. షుగ‌ర్ త‌గ్గుతుంది.. కొవ్వు క‌రుగుతుంది..!

Red Rice Benefits : మ‌నంద‌రికి తెల్ల‌బియ్యంతో వండిన అన్నమే ఎంతో కాలంగా ప్ర‌ధాన ఆహారంగా వ‌స్తూ ఉంది. ప్ర‌పంచ వ్యాప్తంగా కూడా తెల్ల‌బియ్యంతో వండిన అన్నానే ప్ర‌ధాన ఆహారంగా తీసుకుంటూ ఉన్నారు. తెల్ల అన్నాని ఏ కూర‌తో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. అయితే తెల్ల‌బియ్యంతో వండిన అన్నంలో స్టార్చ్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ‌గా ఉంటాయి. ఇవి మ‌న ఆరోగ్యానికి అంత మంచివి కాదు. క‌నుక తెల్ల అన్నాన్ని త‌క్కువ‌గా తీసుకోవాల‌ని నిపుణులు కూడా సూచిస్తున్నారు. అయితే మ‌న‌లో చాలా మందికి తెలియ‌ని విష‌య‌మేమింటంటే బియ్యంలో చాలా ర‌కాలు ఉంటాయి. వాటిలో ఎర్ర బియ్యం కూడా ఒక‌టి. ఈ బియ్యం ఎర్ర‌గా ఉంటుంది. వీటితో వండిన అన్నం కూడా ఎర్ర‌గా ఉంటుంది.

అయితే తెల్ల‌బియ్యం కంటే ఎర్ర బియ్యం మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తుందని, దీనిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి హాని క‌ల‌గ‌కుండా ఉంటుంద‌ని మ‌న శ‌రీరానికి మ‌రిన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని నిపుణులు చెబుతున్నారు. ఎర్ర‌బియ్యాన్ని ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎర్ర‌బియ్యంలో మోనోకోలిన్ ఎక్కువ‌గా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ ను త‌గ్గించి గుండెఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో దోహ‌ద‌ప‌డుతుంది. అలాగే ఎర్ర‌బియ్యాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త‌పోటు కూడా అదుపులో ఉంటుంది. ఎర్ర‌బియ్యంలో సెలీనియం, విట‌మిన్ సి, బీటాకెరోటీన్ వంటివి ఎక్కువ‌గా ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్ నుండి శ‌రీరాన్ని కాపాడ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి.

Red Rice Benefits in telugu controls diabetes
Red Rice Benefits

అలాగే షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తుల‌కు ఎర్ర‌బియ్యంతో ఎంతో మేలు చేస్తాయ‌ని చెప్ప‌వ‌చ్చు. ఎర్ర‌బియ్యాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. షుగ‌ర్ కార‌ణంగా శ‌రీర ఆరోగ్యం దెబ్బ‌తిన‌కుండా ఉంటుంది. ఎర్ర‌బియ్యంలో కొవ్వు, క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి. క‌నుక వీటితో వండిన అన్నాన్ని తీసుకోవ‌డం వల్ల మ‌నం బరువు పెర‌గ‌కుండా ఉండ‌వ‌చ్చు. శ‌రీరంలో కొవ్వు కూడా పేరుకుపోకుండా ఉంటుంది. ఇక ఎర్ర‌బియ్యంలో క్యాల్షియం, ఫాస్ప‌ర‌స్ వంటి ఖ‌నిజాలు కూడా ఉంటాయి. ఇవి శరీర ఎముక‌ల ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో దోహ‌ద‌ప‌డ‌తాయి. ఈ విధంగా ఎర్ర‌బియ్యం మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని వీటితో వండిన అన్నాన్ని తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి మేలే త‌ప్ప ఎటువంటి హాని క‌ల‌గ‌ద‌ని నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts