హెల్త్ టిప్స్

Rice Water : కొవ్వును కరిగించే రైస్ డ్రింక్.. ఎలా త‌యారు చేయాలంటే..?

Rice Water : బరువు తగ్గాలనుకునే వారి కోసం ఎన్నో పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. అయితే కింద ఇచ్చిన సింపుల్ రైస్ డ్రింక్ టిప్‌ను ఓ సారి ట్రై చేసి చూడండి. దీంతో శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవచ్చు. ఇందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

రైస్ డ్రింక్ తయారీకి కావల్సిన పదార్థాలు..

బియ్యం – రెండు టేబుల్ స్పూన్లు, నీరు – తగినంత, జీరా – తగినంత, ఎండిన అల్లం పొడి – తగినంత, మిరియాల పొడి- తగినంత.

rice drink that reduces fat

తయారు చేసే విధానం..

జీరా, అల్లం పొడి, మిరియాల పొడిలను సమాన భాగాల్లో తీసుకుని వాటిని మళ్లీ మిక్సీ పట్టి పొడిగా చేయాలి. ఈ పొడి నుంచి 1/4 టీస్పూన్ పొడిని తీసుకుని దాన్ని బియ్యానికి కలిపి ఈ మిశ్రమాన్ని మళ్లీ ఒక గ్లాస్ నీటికి కలపాలి. ఒక పాత్రలో ఈ మిక్స్‌ను వేసి డికాషన్‌లా మరిగించాలి. అనంతరం వచ్చే ద్రవాన్ని వడకట్టి దానికి కొద్దిగా ఉప్పును కలిపి తీసుకోవాలి. సూప్స్‌కు బదులుగా దీన్ని తాగితే శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వు కరుగుతుంది. అంతేకాదు కొంత ద్రవం తాగినా కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఇది అధిక బరువును తగ్గించుకునేందుకు కూడా ఉపయోగపడుతుంది.

Share
Admin

Recent Posts