నిత్యం మ‌నం తినే అనేక ర‌కాల విష ప‌దార్థాలు ఇవే..!

నిత్యం మ‌నం అనేక ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను తింటుంటాం. వాటిలో మ‌నకు ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాల‌ను అందించేవి కొన్ని ఉంటాయి. కానీ చాలా మంది నిత్యం తినే ఆహారాల్లో అనారోగ్యక‌‌ర‌మైన‌వే ఎక్కువ‌గా ఉంటాయి. వీటి వ‌ల్ల దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు, కొన్ని సంద‌ర్భాల్లో క్యాన్స‌ర్లు వ‌చ్చేందుకు కూడా అవ‌కాశం ఉంటుంది. క‌నుక నిత్యం మ‌నం తినే ఆహారాల్లో అనారోగ్య‌క‌ర‌మైన‌వి ఏమిటో తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. దీని వ‌ల్ల ఆయా అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా శ‌రీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు.

మైదా

roju manam thine vishaharalu ive

అనేక పిండి వంటల్లో దీన్ని వాడుతారు.

వేపుళ్ల‌కు వాడిన నూనె

ఒక‌సారి వేపుళ్ల‌కు వాడిన నూనెను మ‌ళ్లీ మ‌ళ్లీ నూనె ప‌దార్థాల‌ను వేయించేందుకు వాడుతారు. ఈ నూనె అత్యంత ప్ర‌మాద‌క‌రం. బ‌య‌ట బండ్ల‌ వ‌ద్ద ఎక్కువ‌గా ఈ నూనెను ఉప‌యోగించే చిరు తిండ్ల‌ను వండుతుంటారు. క‌నుక వాటికి దూరంగా ఉంటే మంచిది.

కార్న్ స్టార్చ్

క్రిస్పీగా ఆహారాల‌ను త‌యారు చేసేందుకు ఈ పిండిని వాడుతారు. ఇది కూడా మ‌న శరీరానికి హానిక‌ర‌మే.

చ‌క్కెర

చ‌క్కెర పూర్తిగా మానేయ‌మ‌ని చెప్ప‌లేం. కానీ దీని వాడ‌కాన్ని త‌గ్గిస్తే మంచిది. లేదంటే ఇది కూడా విష ప‌దార్థంగా మారుతుంది.

ఉప్పు

చక్కెర ఎలాగో ఉప్పు కూడా అలాగే. త‌క్కువ‌గా వాడుకుంటే ఔష‌ధం. ఎక్కువ‌గా వాడితే విషం అవుతుంది.

టేస్టింగ్ సాల్ట్

బ‌య‌ట అనేక చోట్ల మ‌నం తినే వంట‌కాల్లో రుచి కోసం టేస్టింగ్ సాల్ట్‌ను క‌లుపుతారు. ఇది కూడా అత్యంత ప్ర‌మాద‌క‌రం. క‌నుక వీలైనంత వ‌ర‌కు బ‌య‌ట తిన‌డం మానేయాలి. దీని వ‌ల్ల ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు.

Share
Admin

Recent Posts