జీర్ణాశయంలో ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అవడం వల్ల మనకు అప్పుడప్పుడు అసిడిటీ వస్తుంటుంది. దీన్నే హార్ట్ బర్న్ అంటారు. దీని వల్ల కడుపులో మంటగా ఉంటుంది. అలాగే ఛాతి, మెడ భాగాల్లోనూ నొప్పి వస్తుంది. అయితే సమస్య తీవ్రతరం అయితే అసిడిటీ ప్రభావం గొంతు వరకు వస్తుంది. దీంతో తీవ్రమైన ఇబ్బందులు కలుగుతాయి. సాధారణంగా కొవ్వు పదార్థాలను, మసాలాలు, కారం అధికంగా ఉన్న ఆహారాలను తినడం వల్ల అసిడిటీ వస్తుంది. అయితే ఇందుకు ఇంగ్లిష్ మెడిసిన్‌ను వాడాల్సిన పనిలేదు. ఇంట్లో ఉండే పదార్థాలతోనే అసిడిటీని సులభంగా తగ్గించుకోవచ్చు. అందుకు ఏం చేయాలంటే..
దీన్నే సోడియం బైకార్బొనేట్ అని కూడా అంటారు. సాధారణంగా దీన్ని వంటల్లో వేస్తుంటారు. ఇది అసిడిటీని తగ్గించగలదు. ఇది ఆల్కలైన్ స్వభావాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల యాసిడ్లు తటస్థం అవుతాయి. ఒక గ్లాస్‌లో ఒక టీస్పూన్ బేకింగ్ సోడాను కలుపుకుని తాగితే అసిడిటీ వెంటనే తగ్గుతుంది. అయితే లవణాలు ఎక్కువగా ఉంటాయి కనుక హైబీపీ ఉన్నవారు దీన్ని ఉపయోగించరాదు.
1 టీస్పూన్ జీలకర్ర పొడిని నీటిలో కలుపుకుని తాగితే తక్షణమే అసిడిటీ తగ్గుతుంది. జీలకర్ర అజీర్ణ సమస్యను కూడా పరిష్కరిస్తుంది. హైబీపీ తగ్గుతుంది. జీర్ణాశయంలో అల్సర్లు రాకుండా ఉంటాయి.
అల్లంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు అసిడిటీని తగ్గిస్తాయి. కొద్దిగా అల్లం రసంను సేవించినా లేదా ఒక పాత్రలో ఒక గ్లాస్ నీటిని తీసుకుని అందులో చిన్న అల్లం ముక్క వేసి బాగా మరిగించి ఆ తరువాత వచ్చే నీటిని తాగినా, అల్లం రసంను ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా కలుపుకుని తాగినా.. అసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది.
అల్సర్లను తగ్గించే శక్తి తులసి ఆకుల రసంకు ఉంటుంది. తులసి ఆకులను నిత్యం నమిలి తినడం వల్ల అసిడిటీ ఉండదు. జీర్ణాశయ గోడలను సంరక్షించే గుణాలు తులసిలో ఉంటాయి. అందువల్ల అల్సర్లు రావు.
పసుపులో కర్‌క్యుమిన్ అనబడే సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటుంది. అందువల్ల అసిడిటీ తగ్గుతుంది. చిటికెడు పసుపును ఒక గ్లాస్ నీటిలో కలుపుకుని తాగితే ఫలితం ఉంటుంది. దీంతోపాటు అల్సర్లు కూడా తగ్గుతాయి.