Sabja Seeds : స‌బ్జా గింజ‌ల‌ను ఇలా తీసుకుంటే.. కేజీల‌కు కేజీలు సుల‌భంగా బ‌రువు త‌గ్గుతారు..

Sabja Seeds : అధిక బ‌రువు.. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు మ‌న‌లో చాలా మంది ఉండే ఉంటారు. మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లు, త‌గినంత శారీర‌క శ్ర‌మ లేక‌పోవ‌డం వంటి అనేక కార‌ణాల చేత మ‌నం ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నాం. అధిక బ‌రువు ఉండ‌డం మ‌న ఆరోగ్యానికి అంత మంచిది కాద‌ని దీని వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు తలెత్తుతాయ‌ని నిపుణులు చెబుతున్నారు. బ‌రువు త‌గ్గ‌డానికి చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ ఉండ‌దు. రోజూ వ్యాయామాలు చేస్తూ ఉంటారు. అలాగే బ‌రువును త‌గ్గించే మందుల‌ను కూడా వాడుతూ ఉంటారు.

ఆహార నియ‌మాల‌ను పాటిస్తూ ఉంటారు. ఎన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేసినప్ప‌టికీ కొంద‌రు బ‌రువు మాత్రం త‌గ్గ‌రు. ఇలా అధిక బ‌రువుతో బాధ‌ప‌డే వారు కింద తెల‌ప‌బోయే ఈ స‌హ‌జసిద్ద‌మైన చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఫ‌లితం ఉంటుంది. బ‌రువును త‌గ్గించే చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అధిక బ‌రువును తగ్గించ‌డంలో మ‌న‌కు స‌బ్జాగింజ‌లు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటిని ఆంగ్లంలో చియా సీడ్స్ అంటారు. ఇవి అధిక బ‌రువును త‌గ్గించ‌డంలో అద్భుతంగా ప‌ని చేస్తాయి. పొట్ట చుట్టూ ఉండే కొవ్వును క‌రిగించ‌డంలో వీటికి ఏవి కూడా సాటి రావ‌నే చెప్ప‌వ‌చ్చు.

Sabja Seeds very beneficial in reducing over weight here it is how
Sabja Seeds

శ‌రీరంలో ఉండే చెడు కొవ్వును క‌రిగించి మంచి కొవ్వును పెంచ‌డంలో ఇవి ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి. స‌బ్జా గింజ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల బ‌రువు త‌గ్గ‌డంతోపాటు శ‌రీరంలో ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ వ్య‌వ‌స్థ కూడా మెరుగుపడుతుంది. వీటిలో అధికంగా ఉండే ఫైబ‌ర్ జీర్ణ శ‌క్తిని మెరుగుప‌రిచి అజీర్తి, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది. త‌ర‌చూ ఇన్ ఫెక్ష‌న్ ల బారిన పడే వారు స‌బ్జా గింజ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ పెరిగి వ్యాధుల బారిన ప‌డ‌కుండా ఉంటాం. అలాగే వీటిలో ఉండే పోష‌కాలు ఇన్సులిన్ ను త‌గ్గించి షుగ‌ర్ వ్యాధిని అదుపులో ఉంచ‌డంలో దోహ‌దప‌డ‌తాయి.

స‌బ్జా గింజ‌ల‌ను ఏవిధంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం బ‌రువు త‌గ్గ‌వచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ స‌బ్జా గింజ‌ల‌ను వేసి అర గంట పాటు నాన‌బెట్టాలి. అర గంట త‌రువాత ఈ నీటిని తాగాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మ‌నం త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గుతామ‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ స‌బ్జా నీటిని ప్ర‌తిరోజూ ఒక గ్లాస్ మోతాదులో తీసుకోవ‌డం వ‌ల్ల త్వ‌ర‌గా బ‌రువు తగ్గి నాజుకుగా తయార‌వుతార‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ స‌బ్జా గింజ‌ల‌ను స‌లాడ్స్, సూప్స్ వంటి వాటితో తీసుకోవ‌చ్చు. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు ఇలా స‌బ్జా గింజ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల సుల‌భంగా బ‌రువు త‌గ్గుతార‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts