Saffron : గర్భిణీ స్త్రీలు పాలల్లో కుంకుమ పువ్వును వేసుకుని తాగడం వల్ల పుట్టే పిల్లలు మంచి రంగుతో పుడతారని మనం చాలా కాలంగా వింటూనే ఉన్నాం. అసలు గర్భిణీ స్త్రీలు కుంకుమ పువ్వును తీసుకోవచ్చా, దీనిని వారు ఎలా తీసుకోవాలి.. అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. భారతీయ వంటకాల్లో మసాలా దినుసులుగా ఉపయోగించే వాటిల్లో కుంకుమ పువ్వు కూడా ఒకటి. దీనిని ఎంతో కాలంగా మనం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉన్నాం.
కుంకుమ పువ్వును తీపి పదార్థాల తయారీలో, సౌందర్య సాధనాల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. కుంకుమ పువ్వులో ఎన్నో రకాల మంచి గుణాలు ఉన్నాయి. గర్భిణీ స్త్రీలు దీనిని నిస్సందేహంగా ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు. గర్భిణీ స్త్రీలు కుంకుమ పువ్వును తీసుకోవడం వల్ల అనేక రకాల సమస్యల నుండి బయట పడవచ్చు. గర్భాశయ ఉద్దీపనకు కూడా కుంకుమ పువ్వును ఉపయోగిస్తారు. కుంకుమ పువ్వును తీసుకోవడం వల్ల గర్భిణీ స్త్రీలల్లో కండరాలు బలపడతాయి. కుంకుమ పువ్వులో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి.
గాయాలు, దెబ్బలపై కుంకుమ పువ్వును పేస్ట్ గా చేసి రాయడం వల్ల అవి త్వరగా మానుతాయి. జీర్ణశక్తిని మెరుగుపరిచే గుణం కూడా కుంకుమ పువ్వుకు ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల ఆకలి పెరగుతుంది. గర్భిణీ స్త్రీలలో మనసు ఎప్పుడూ చంచలత్వాన్ని కలిగి ఉంటుంది. కుంకుమ పువ్వును తీసుకోవడం వల్ల వారి మనసు నిర్దిష్టంగా మారుతుంది. అలాగే వీరిలో రక్తప్రసరణలో తరచూ మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. కుంకుమ పువ్వును తీసుకోవడం వల్ల వారిలో రక్తప్రసరణ చక్కగా ఉంటుంది.
గర్భిణీ స్త్రీలు కుంకుమ పువ్వును రెండో నెల నుండి తీసుకోవడం ప్రారంభించవచ్చు. దీనిని ఉదయం అలాగే రాత్రి పూట వేడి పాలల్లో కలిపి తీసుకోవాలి. చిటికెడు కుంకుమ పువ్వును వేడి పాలల్లో కలిపి తీసుకోవడం వల్ల చక్కటి ప్రయోజనాలను పొందవచ్చు. అలాగే దీనిని కొనుగోలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు వహించాలి. మంచి కంకుమ పువ్వును ఉపయోగించడం వల్ల మాత్రమే మనం ఈ ప్రయోజనాలను పొందవచ్చు. అలాగే ఐఎస ఐ మార్కు ఉన్న కుంకుమ పువ్వును మాత్రమే కొనుగోలు చేయాలి.
గర్భిణీ స్త్రీలు కుంకుమ పువ్వును తీసుకోవడం వల్ల పుట్టబోయే బిడ్డలు మంచి రంగుతో పుడతారు. దీనిని అతిగా తీసుకోవడం కూడా అంత మంచిది కాదు. సాధారణంగా గర్భిణీ స్త్రీలలో ఆహారం నెమ్మదిగా జీర్ణమవుతుంది. పాలల్లో కలిపి దీనిని తీసుకోవడం వల్ల ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. కేవలం గర్భిణీ స్త్రీలే కాకుండా దీనిని ఇతరులు కూడా తీసుకోవచ్చు. కుంకుమ పువ్వును తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. క్యాన్సర్, ఉబ్బసం వంటి వ్యాధుల బారిన పడకుండా ఉంటాం.
పురుషుల్లో వ్యంధత్వాన్ని తగ్గించడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈ విధంగా కుంకుమ పువ్వు మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని, దీనిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.