హెల్త్ టిప్స్

Shankhpushpi Tea : ఈ పువ్వుల‌ను మీరు చూసే ఉంటారు.. వీటితో టీ త‌యారు చేసి తాగితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Shankhpushpi Tea : శంఖు పూలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శంఖు పూలు కేవలం పూజకి మాత్రమే కాదు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా ఇవి అందిస్తాయి. ప్రతిరోజు కూడా, చాలామంది ఆరోగ్యకరమైన పద్ధతుల్ని పాటిస్తున్నారు. ఈ రోజుల్లో మారిన జీవనశైలి కారణంగా ఎన్నో సమస్యలు వస్తున్నాయి. అయితే, ఇటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోండి. అప్పుడు ఎటువంటి సమస్యలు కూడా కలగవు. ఆరోగ్యంగా ఉండాలంటే, శంఖు పూలతో చేసిన టీ ని తీసుకోండి.

శంఖు పూలను ఎక్కువగా శివుడు ని ఆరాధించడానికి మనం వాడుతూ ఉంటాము. శంఖు పూలతో టీ చేసుకుని తాగితే వివిధ రకాల సమస్యలకు దూరంగా ఉండవచ్చు. ప్రతిరోజు పరగడుపున ఈ టీ తీసుకుంటే అధిక బరువు నుండి ఈజీగా బయటపడవచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఈ టీ తీసుకోవచ్చు. వాళ్లకి ఇంకా మంచి జరుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలని కంట్రోల్ లో ఉంచగలదు. రోగనిరోధక శక్తిని కూడా ఈ టీ పెంచుతుంది.

shankhapushpi tea many wonderful health benefits

ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యల నుండి దూరంగా ఉంచుతుంది. ఇలా, ఈ పూల టీ తో ఎన్నో లాభాలని మనం పొందడానికి అవుతుంది. ఈ టీ ని ఎలా తయారు చేసుకోవాలి అనే విషయాన్ని కూడా ఇప్పుడు చూద్దాం. పొయ్యి వెలిగించి, పొయ్యి మీద గిన్నె పెట్టుకుని, ఒక గ్లాసు నీళ్లు పోసుకోండి.

వేడి అయిన తర్వాత ఆరు శంఖు పువ్వులు, ఒక అంగుళం అల్లం ముక్క వేయండి. ఐదు నుండి ఏడు నిమిషాల పాటు దీనిని మరిగించుకోవాలి. ఇప్పుడు వాడకట్టేసి, తేనే, నిమ్మరసం వేసుకొని తీసుకోండి. ఇలా ఎంతో ఈజీగా దీన్ని మనం తయారు చేసుకోవచ్చు. ఈ టీ ని తయారు చేసుకుని తీసుకోవడం వలన, ఈ సమస్యలు అన్నిటికీ దూరంగా ఉండవచ్చు. ఆరోగ్యంగా ఉండొచ్చు.

Admin

Recent Posts