ఎండాకాలం వచ్చిందంటే చాలు.. ఏసీలు ఆన్ అయిపోతాయి. చాలా మంది చల్లదనాన్నిచ్చే ఏసీల్లో గడిపేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు. వేసవి సీజన్‌లో ఏసీలను చాలా మంది కొంటారు. అయితే వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు ఏసీలు బాగానే పనిచేస్తాయి. కానీ వాటిల్లో నిజానికి ఎక్కువ సేపు గడపరాదు. ఏసీల్లో ఎక్కువ సమయం ఉండడం వల్ల పలు అనారోగ్య సమస్యలు వస్తాయి. అవేమిటంటే…
కళ్లు పొడిబారిపోయే సమస్య ఉన్నవారు ఏసీల్లో ఎక్కువ సేపు ఉండరాదు. ఆ సమస్య వల్ల కళ్లు దురదలు పెడతాయి. సమస్య మరింత ఎక్కువవుతుంది. అందువల్ల ఆ సమస్య ఉన్నవారు ఏసీల్లో గడపకపోవడమే మంచిది. అలాగే ఆ సమస్య లేని వారికి కూడా కళ్లు పొడిబారి దురదలు పెట్టేందుకు అవకాశం ఉంటుంది. కనుక ఏసీల్లో ఎక్కువ సమయం గడిపేవారు ఈ సమస్య గురించి ఆలోచించాలి.
ఏసీల కింద ఎక్కువ సమయం గడపడం వల్ల చర్మంలోని తేమ పోయి చర్మం పొడిగా మారుతుంది. అయితే ఏసీ ఉన్న ప్రదేశం నుంచి బయటకు వస్తే ఆ సమస్య తగ్గుతుంది. కానీ దీర్ఘకాలం పాటు ఏసీల్లో గడిపితే సమస్య ఎక్కువవుతుంది. కనుక దీన్ని కూడా గమనించాలి.
ఏసీలు ఉన్న ప్రదేశంలో గాలిలోని తేమ త్వరగా తగ్గుతుంది. దీంతో మనకు డీహైడ్రేషన్ సమస్య వస్తుంటుంది. శరీరంలో నీరు త్వరగా అయిపోతుంది. ఫలితంగా మాటి మాటికీ నీటిని తాగాల్సి వస్తుంది. ఇది మనల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది.
ఏసీలు ఉన్న ప్రదేశాల్లో ఎక్కువ సమయం పాటు ఉండడం వల్ల ముక్కు, గొంతు, కళ్ల సమస్యలు వస్తాయి. గొంతు పొడిగా మారుతుంది. దగ్గు వస్తుంది. అలాగే ముక్కులో ఉండే మ్యూకస్ పొర వాపునకు గురవుతుంది. దీంతో వైరల్ ఇన్‌ఫెక్షన్లు వస్తాయి.
ఆస్తమా, అలర్జీల వంటి సమస్యలు ఉన్న వారిని ఏసీలు మరిన్ని ఇబ్బందులకు గురి చేస్తాయి. అలాంటి వారు ఏసీల కింద వీలైనంత వరకు ఉండకూడదు. తప్పదనుకుంటే అప్పుడప్పుడు బయటకు వచ్చి కొంత సేపు గడపాలి.
ఏసీల్లో ఎక్కువ సేపు ఉంటే ముక్కులో పొడిదనం ఏర్పడుతుంది. దీంతో ఆ ప్రదేశంలో ఉండే మ్యూకస్ పొర ఇర్రిటేషన్‌కు గురవుతుంది. ఫలితంగా వైరల్ ఇన్‌ఫెక్షన్లు ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది.
ఏసీలు ఉన్న ప్రదేశంలో ఎక్కువ సమయం పాటు గడపడం వల్ల డీహైడ్రేషన్ బారిన పడతాం అని చెప్పుకున్నాం కదా.. అయితే డీహైడ్రేషన్ వల్ల కొందరిలో తలనొప్పి వస్తుంటుంది. ఇందుకు గాను నీటిని తాగాల్సి ఉంటుంది. అదే మైగ్రేన్ సమస్య ఉన్నవారు అయితే ఏసీల్లో ఉండరాదు.
ఏసీల్లో ఎక్కువ సమయం గడపడం వల్ల పైన తెలిపిన సమస్యలు వస్తున్నాయని అనుకుంటే ఏసీల్లో ఉండరాదు. తప్పనిసరి అనుకుంటే అప్పుడప్పుడు బయటకు వచ్చి కొంతసేపు గడపాలి. లేదా వీలైనంత వరకు ఏసీల వాడకాన్ని తగ్గించాలి. దీంతో అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.