Sugandhi Water : మన శరీరంలో ముఖ్యమైన అ వయవాల్లో కాలేయం కూడా ఒకటి. కాలేయం మన శరీరంలో కీలకపాత్ర పోషిస్తుంది. మనం తినే ఆహారంలో ఉండే రసాయనాలను, విష పదార్థాలను అలాగే నీరు, గాలి ద్వారా మన శరీరంలోకి చేరిన మలినాలను, కర్బన వ్యర్థాలను, మనం వాడే మందుల్లో ఉండే వ్యర్థాలన్నింటిని కాలేయం విచ్చినం చేసి బయటకు పంపిస్తుంది. కాలేయ ఆరోగ్యం సరిగ్గా ఉంటేనే ఈ వ్యర్థాలన్ని కూడా బయటకు పోతాయి. లేదంటే ఇవి కాలేయంలో పేరుకుపోయి క్రమంగా కాలేయ ఆరోగ్యం దెబ్బతింటుంది.
దీంతో శరీర ఆరోగ్యం కూడా రోజురోజుకు నశిస్తుంది. వ్యర్థాలను బయటకు పంపించే డీటాక్సిఫికేషన్ ప్రక్రియను కాలేయం సరిగ్గా నిర్వర్తించాలంటే కాలేయానికి కొన్ని రకాల పోషకాలు, రసాయనాలు అవసరం. కాలేయ పనితీరును మెరుగుపరచడానికి అవసరమయ్యే పోషకాలను కలిగి ఉన్న వాటిల్లో సుంగధ కూడా ఒకటి. ఇది మనకు ప్రకృతి నుండి సహాజ సిద్దంగా లభిస్తుంది. దీనిలో కాలేయాన్ని శుభ్రపరిచే 42 రకాల శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయని నిపుణులు పరిశోధనల వెల్లడించారు. సుగంద వేర్లతో డికాషన్ ను తయారు చేసుకుని తీసుకోవడం వల్ల కాలేయం శుభ్రపడడంతో పాటు శరీరం కూడా శుభ్రపడుతుందని వారు చెబుతున్నారు. 100 గ్రాముల సుగంధ వేర్లను 2 లీటర్ల నీటిలో వేసి ఒక లీటర్ అయ్యే వరకు మరిగించాలి.
తరువాత ఈ డికాషన్ చల్లారిన తరువాత దీనిని వడకట్టి గ్లాసులోకి తీసుకోవాలి. తరువాత ఇందులో తేనె, నిమ్మరసం కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే మలినాలను, విష పదార్థాలను, వ్యర్థాలను కాలేయం మూత్రం ద్వారా పూర్తిగా బయటకు పంపించగలదు. మనలో చాలా మంది జంక్ పుడ్ ను, ప్రాసెస్ట్ ఫుడ్ ను తీసుకుంటూ ఉంటారు. అలాగే మనం తీసుకునే ఆహారాలను కూడా ఎరువులు, పురుగు మందులు వేసి పండిస్తూ ఉంటారు. అలాగే మద్యపానం కూడా చేస్తూ ఉంటారు. ఇలా మన శరీరంలోకి చేరిన రసాయనాలన్నింటిని సమర్థవంతంగా కాలేయం బయటకు పంపిచాలంటే మనం సుగంధ నీటిని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నీటిని రోజుకు ఒకటి లేదా రెండు గ్లాసుల మోతాదులో తీసుకోవడం వల్ల కాలేయంలో డిటాక్సిఫికేషన్ ప్రక్రియ సమర్థవంతంగా జరుగుతుంది. దీంతో కాలేయం శుభ్రపడడంతో పాటు శరీరం కూడా శుభ్రపడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.