Butter Milk : ఉద‌యం కాఫీ, టీ ల‌కు బ‌దులుగా దీన్ని తాగండి.. ఎన్నో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

Butter Milk : మ‌నం పాల నుండి త‌యారు చేసిన మజ్జిగ‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. బాగా గ‌ట్టిగా తోడుకున్న గేదె పెరుగు నుండి త‌యారు చేసిన మ‌జ్జిగ చాలా రుచిగా ఉంటుంది. మ‌జ్జిగ ఎంత చిక్క‌గా ఉంటే అంత రుచిగా ఉంటుంది. కానీ ప్ర‌స్తుత కాలంలో నూటికి తొంభై శాతం మంది మ‌జ్జిగ‌ను తీసుకోవ‌డం మానేసారు. రెండు పూట‌లా పెరుగునే ఆహారంగా తీసుకుంటున్నారు. పెరుగును తీసుకోవ‌డం వ‌ల్ల వాత రోగాలు ఎక్కువ‌య్యే అవ‌కాశం ఉంది. పెరుగును చిలికి త‌యారు చేసిన మ‌జ్జిగ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మ‌జ్జిగ‌లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాలు, మైక్రో న్యూట్రియ‌న్స్ ఉంటాయి.

మ‌జ్జిగ ఒక సంపూర్ణ పౌష్టికాహారం. దీనిలో ఎన్నో ఎంజైమ్ లు, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. మ‌జ్జిగ శ‌రీరంలోని వేడిని తగ్గించి చ‌ల్ల‌గా ఉంచుతుంది. చాలా మంది నిద్ర‌లేవ‌గానే మంచి నీటిని తాగుతారు. కొంద‌రు కాఫీ లేదా టీ వంటి వాటిని తాగుతూ ఉంటారు. ఇది చాలా మందికి ఉండే అల‌వాటు. కానీ నిద్ర‌లేవ‌గానే ప‌ర‌గ‌డుపున ఒక గ్లాస్ మ‌జ్జిగ తాగితే ఎన్నో ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు దూరంగా ఉండ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. ఒక గ్లాస్ మ‌జ్జిగ‌ను తాగ‌డం వల్ల‌ క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

take Butter Milk daily morning instead of coffee and tea know the benefits
Butter Milk

మ‌జ్జిగ‌లో ప్రో బ‌యాటిక్ బ్యాక్టీరియా ఉంటుంది. ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున మజ్జిగ తాగితే జీర్ణ‌స‌మ‌స్య‌లు మాయ‌మ‌వుతాయి. ముఖ్యంగా క‌డుపులో మంట‌, అసిడిటి, అల్స‌ర్, గ్యాస్ వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు మ‌జ్జిగ‌ను తాగ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఫ‌లితం ఉంటుంది. అలాగే ప‌ర‌గ‌డుపున మ‌జ్జిగ తాగ‌డం వ‌ల్ల జీర్ణాశ‌యం, ప్రేగులు శుభ్ర‌ప‌డ‌తాయి. వాటిల్లో ఉండే హానికార‌క క్రిములు న‌శిస్తాయి. మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది అజీర్తి, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌ల‌ను దూరం చేస్తుంది. రాత్రి మిగిలిన అన్నంలో మజ్జిగ‌, ఉప్పు క‌లిపి కుండ‌లో పెడితే ఉద‌యానికి ఆ అన్నం పులిసి మంచి పోష‌కాల‌తో సిద్ధం అవుతుంది.

ఈ అన్నాన్ని తిన‌డం వ‌ల్ల రోజంతా ఉత్సాహంగా ఉండ‌వ‌చ్చు. ఇలా మ‌జ్జిగ‌లో పులియ‌బెట్టిన అన్నంలో శ‌రీరానికి మంచి చేసే అధికంగా ఉంటుంది. మ‌జ్జిగ‌లో క‌రివేపాకు, మిరియాలు క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. ఇది జీర్ణ‌శ‌క్తి పెరుగుతుంది. అలాగే ఈ విధంగా మ‌జ్జిగ‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వు క‌రుగుతుంది. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉంటాయి. విరోచ‌నాల‌తో బాధ‌ప‌డే వారు ఉద‌యాన్నే ప‌రుగ‌డుపున మ‌జ్జిగ‌లో అర టీ స్పూన్ అల్లం ర‌సం క‌లిసి తీసుకోవ‌డం వ‌ల్ల విరోచ‌నాలు త‌గ్గిపోతాయి. అధిక ర‌క్త‌పోటుతో బాధ‌ప‌డే వారు ఉద‌యాన్నే ప‌రగ‌డుపున మ‌జ్జిగ‌ను తీసుకోవ‌డం మంచి ఫ‌లితం ఉంటుంది.

మ‌జ్జిగ‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి. ఇందులో ఉన్న రైబోప్లేవిన్ శ‌రీరంలోని వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపిస్తుంది. బ‌రువు త‌గ్గ‌డంలో మ‌జ్జిగ కూడా మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. మ‌జ్జిగ‌ను రోజూ తీసుకోవ‌డం వల్ల శ‌రీరంలో ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ సాఫీగా సాగుతుంది. ఈ విధంగా మ‌జ్జిగ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌ని దీనిని ఉద‌యం ప‌ర‌గ‌డుపున తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజనాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. మ‌జ్జిగ‌ను త‌ప్ప‌కుండా ఆహారంలో భాగంగా చేసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

D

Recent Posts