Cardamom : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి యాలకులను వంటి ఇంటి మసాలా దినుసుగా ఉపయోగిస్తున్నారు. యాలకులను ఎక్కువగా కూరల్లో, తీపి వంటకాల్లో వేస్తుంటారు. దీంతో వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే యాలకుల వల్ల మనకు ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక లాభాలు పొందవచ్చు. రోజూ ఉదయాన్నే పరగడుపునే రెండు మూడు యాలకులను తిని తరువాత గోరు వెచ్చని నీళ్లను తాగాలి. దీంతో అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. యాలకులను రోజూ తినడం వల్ల హైబీపీ తగ్గుతుంది. బీపీ అధికంగా ఉన్నవారు రోజూ యాలకులను తింటే బీపీ అదుపులోకి వస్తుంది. శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. దీంతో గుండె జబ్బులు రాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
2. యాలకుల్లో పలు రకాల సమ్మేళనాలు, ఎంజైమ్‌లు ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడుతాయి. క్యాన్సర్ రాకుండా చూస్తాయి.
3. యాలకుల్లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల వీటిని రోజూ తింటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది.
4. అల్సర్లను నయం చేసే శక్తి యాలకులకు ఉంటుంది. దీంతోపాటు అజీర్ణం నుంచి బయట పడవచ్చు. మలబద్దకం తగ్గుతుంది. జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. రోజూ కడుపులో అసౌకర్యంగా ఉండేవారు, వికారం, వాంతికి వచ్చినట్లు అనిపించే వారు యాలకులను తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఆయా సమస్యలు తగ్గుముఖం పడతాయి.
5. యాలకులను తినడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది. నోట్లో ఉండే బాక్టీరియా నశిస్తుంది. దంతాలు, చిగుళ్ల సమస్యలు పోతాయి. వాటి నొప్పి తగ్గుతుంది. అవి ఆరోగ్యంగా ఉంటాయి.
6. యాలకుల్లో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. అందువల్ల వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూసుకోవచ్చు. జ్వరం వచ్చిన వారు యాలకులను తింటే త్వరగా జ్వరం తగ్గుతుంది. అలాగే దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి బయట పడవచ్చు. ఫంగస్ ఇన్‌ఫెక్షన్ల నుంచి విముక్తి లభిస్తుంది. చర్మ సమస్యలు తగ్గుతాయి.
7. యాలకుల్లో ఉండే సమ్మేళనాలు ఊపిరితిత్తులకు ఆక్సిజన్‌ను ఎక్కువగా అందేలా చేస్తాయి. దీంతో శ్వాస తీసుకోవడంలో ఉండే ఇబ్బందులు తొలగిపోతాయి. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. అవి శుభ్రంగా మారుతాయి.
8. షుగర్ సమస్య ఉన్నవారు రోజూ యాలకులను తినడం వల్ల షుగర్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. దీంతోపాటు కొలెస్ట్రాల్ లెవల్స్ కూడా తగ్గుతాయి. హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి.
9. యాలకుల్లో అనేక రకాల ఎంజైమ్ లు ఉంటాయి. ఇవి లివర్ ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. లివర్ పనితీరును మెరుగు పరుస్తాయి. లివర్ సమస్యలు ఉన్నవారు రోజూ యాలకులను తింటే లివర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది. లివర్ వ్యాధుల నుంచి బయట పడవచ్చు.
10. ఒత్తిడి, ఆందోళన, కంగారు వంటి సమస్యలను తగ్గించి మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో యాలకులు అద్భుతంగా పనిచేస్తాయి. కనుక యాలకులను రోజూ తినాలి.
11. అధిక బరువు ఉన్నవారు రోజూ యాలకులను తినడం వల్ల ఫలితం ఉంటుంది. శరీరంలో కొవ్వు కరుగుతుంది. బరువును తగ్గించుకోవచ్చు.