Vellulli Karam : వెల్లుల్లితో మనకు ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. వెల్లుల్లిని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. దీంతో హార్ట్ ఎటాక్ లు రాకుండా ఉంటాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే హైబీపీ తగ్గుతుంది. ఇంకా మనకు ఎన్నో ప్రయోజనాలు వెల్లుల్లి వల్ల కలుగుతాయి. అయితే వెల్లుల్లిని నేరుగా తినలేని వారు దాంతో కారం తయారు చేసుకుని తినవచ్చు. రోజూ అన్నంలో మొదటి ముద్దగా వెల్లుల్లి కారం వేసి తింటే మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. ఇది సహజసిద్ధమైంది. కనుక మనకు ఎలాంటి హాని కలగదు. ఆరోగ్యకరమైన ప్రయోజనాలే కలుగుతాయి. ఇక వెల్లుల్లితో కారం ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వెల్లుల్లి కారం తయారీకి కావల్సిన పదార్థాలు..
ఎండు మిర్చి – 15, వెల్లుల్లి – ఆరు రెబ్బలు, నూనె – 2 టేబుల్ స్పూన్లు, మినప పప్పు – టేబుల్ స్పూన్, చింత పండు – కొద్దిగా, ఉప్పు – సరిపడా.
వెల్లుల్లి కారం తయారు చేసే విధానం..
బాణలిలో నూనె వేసి కాగాక ఎండు మిర్చి, మినప పప్పు వేసి వేయించాలి. తరువాత జీలకర్ర కూడా వేసి వేగనివ్వాలి. విడిగా మరో పాన్‌లో వెల్లుల్లి రెబ్బలను వేసి వేయించాలి. అన్నీ చల్లారాక మిక్సీలో వేసి పొడి చేయాలి. దీంతో ఎంతో రుచికరమైన వెల్లుల్లి కారం తయారవుతుంది. దీన్ని తింటే మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. నోరు చేదుగా ఉన్నవారు, జ్వరం వచ్చిన వారు దీన్ని తింటే ఎంతో మేలు జరుగుతుంది. వెల్లుల్లి వల్ల పలు వ్యాధులను కూడా మనం నయం చేసుకోవచ్చు.