Mangoes : ఒకప్పుడు అంటే మామిడి పండ్లు మనకు కేవలం సీజన్‌లోనే లభించేవి. కానీ ఇప్పుడు అలా కాదు. కావాలనుకుంటే ఎప్పుడైనా సరే మామిడి పండ్లు లభిస్తాయి. అయితే వేసవి సీజన్ లో వీటిని తినేందుకే చాలా మంది ఆసక్తిని కనబరుస్తుంటారు. తరువాత వీటిని అంతగా పట్టించుకోరు. ఇక మామిడి పండ్లను చాలా మంది వివిధ రకాలుగా తీసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే మామిడి పండ్లను ఎలా తీసుకుంటే ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
మామిడి పండ్లను నేరుగా అలాగే తింటే ఎంతో మంచిది. ముఖ్యంగా కెమికల్స్ వాడకుండా సహజసిద్ధంగా పండినవి అయితే తొక్కతో సహా అలాగే తినేయాలి. ఇలా తింటేనే ఎక్కువ ప్రయోజనాలు లభిస్తాయి. అయితే మామిడి పండ్లను కొని తెచ్చాక వాటిని బాగా కడిగి ఆరబెట్టాలి. వాటిపై ఉండే నీరు పూర్తిగా ఆవిరై అవి పొడిగా మారాక మాత్రమే వాటిని కట్ చేసి తినాలి. ఇలా తింటేనే మామిడి పండ్ల ద్వారా ఎక్కువ ఫలితాలను పొందవచ్చు.
ఇక మామిడి పండ్లను ఇతర ఏ పండ్లతో అయినా సరే కలిపి కూడా తినవచ్చు. అందులో నియంత్రణ ఏమీ లేదు. ఇతర పండ్లతో కలిపి మామిడి పండ్లను ముక్కలుగా చేసి సలాడ్ రూపంలో తీసుకోవచ్చు. దీంతోనూ మనం ఎక్కువ ప్రయోజనాలనే పొందవచ్చు. మామిడి పండ్లను పాలు, పెరుగు, మజ్జిగ వంటి వాటిని కలిపి స్మూతీల రూపంలో తీసుకుంటుంటారు. అయితే వీటి కన్నా ఈ పండ్లను నేరుగా తీసుకుంటేనే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి.
మామిడి పండ్లను కొందరు ఇతర జంక్ ఫుడ్ తో కలిపి తింటారు. అలా తింటే ఎలాంటి ప్రయోజనం ఉండదు. పైగా క్యాలరీలు అధికంగా చేరుతాయి. కనుక జంక్ ఫుడ్, మామిడి పండ్లను కలిపి తినరాదు. కనీసం 2 గంటల గ్యాప్ ఉండాలి. అలా తింటేనే మామిడి పండ్ల ద్వారా ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. ఇక మామిడి పండ్లను బాగా వాసన చూస్తే పండిన తియ్యని వాసన వస్తాయి. అలా రాకపోతే వాటిని కృత్రిమంగా కార్బైడ్ వేసి పండించినవి అని అర్థం చేసుకోవాలి. సహజసిద్ధంగా పండిన మామిడి పండ్లను తింటేనే మనకు ఎక్కువ ప్రయోజనాలు లభిస్తాయి. కనుక ఇకపై మామిడి పండ్లను తినే ముందు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోండి.