మన శరీరంలోని అవయవాల్లో లివర్ ఒకటి. ఇది అనేక పనులను నిర్వర్తిస్తుంది. మన శరీరంలో పేరుకుపోయే వ్యర్థాలను బయటకు పంపుతుంది. ముఖ్యంగా విష పదార్థాలను లివర్ బయటకు పంపిస్తుంది. దీంతో అనారోగ్యాల బారిన పడకుండా సురక్షితంగా ఉంటాం. అయితే మనం తీసుకునే పలు ఆహారాలు, తాగే ద్రవాలు, పాటించే జీవనశైలి వల్ల మనకు లివర్ సమస్యలు వస్తుంటాయి.
మద్యం ఎక్కువగా సేవించడం వల్ల కొందరికి ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది. ఇక మద్యం సేవించకపోయినా కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది. అలాగే కొందరికి లివర్ క్యాన్సర్, హెపటైటిస్ వంటి లివర్ సమస్యలు వస్తుంటాయి. ఈ క్రమంలనే బరువు అకస్మాత్తుగా తగ్గిపోవడం, ఆకలి లేకపోవడం, శరీరం పచ్చగా మారడం.. వంటి అనేక లక్షణాలు కనిపిస్తుంటాయి.
అయితే లివర్ సమస్యలు ఉన్నవారు తమకు ఉండే లక్షణాలను అర్థం చేసుకుని డాక్టర్‌ను కలిసి చికిత్స తీసుకోవాలి. ఇక ఆహారంలోనూ మార్పులు చేసుకోవాలి. పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తినాలి. దీని వల్ల లివర్ శుభ్రపడుతుంది. ఆరోగ్యంగా ఉంటుంది. అయితే లివర్‌ను శుభ్ర పరిచి లివర్ వ్యాధులను తగ్గించడంలో బొప్పాయి అద్భుతంగా పనిచేస్తుంది. ఈ పండ్లను రోజూ తినడం వల్ల ఎలాంటి లివర్ వ్యాధి అయినా సరే తగ్గిపోతుంది.
బొప్పాయి పండ్లలో విటమిన్లు ఎ, బి, సి, ఇ లు అధికంగా ఉంటాయి. అలాగే ఐరన్, కాల్షియం, మెగ్నిషియం, పొటాషియం, కోలిన్ వంటి పోషకాలు ఉంటాయి. అందువల్ల క్యాన్సర్ కణాల పెరుగుదల ఆగిపోతుంది. కనుక బొప్పాయి పండును రోజూ తీసుకోవాలి.
బొప్పాయి పండును రోజూ ఒక కప్పు మోతాదులో తినడం వల్ల లివర్ శుభ్రంగా మారుతుంది. లివర్‌లో ఉండే వ్యర్తాలు బయటకు పోతాయి. ఫ్యాట్ కరుగుతుంది. లివర్ ఆరోగ్యంగా మారుతుంది. అలాగే బొప్పాయి ఆకుల రసాన్ని కూడా రోజూ పావు టీస్పూన్ చొప్పున తాగుతుండాలి. దీంతో అన్ని రకాల లివర్ సమస్యలు తగ్గుతాయి. లివర్ ఆరోగ్యంగా ఉంటుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365