మీరు రోజూ కాఫీ తాగుతారా ? మీరు కాఫీ ప్రియులా ? అయితే సైంటిస్టులు మీకు గుడ్ న్యూస్ చెబుతున్నారు. ఎందుకంటే.. రోజూ ఒక కప్పు కాఫీ తాగడం వల్ల కోవిడ్ సోకే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని వారు చెబుతున్నారు. ఈ మేరకు నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఓ అధ్యయనం చేపట్టారు.
రోజుకు 1 కప్పు లేదా అంత కన్నా ఎక్కువ కప్పుల మోతాదులో కాఫీని తాగే వారికి కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు 10 శాతం తక్కువగా ఉంటాయని తేల్చారు. కాఫీ తాగని వారితో పోలిస్తే తాగే వారికి కోవిడ్ సోకే అవకాశాలు 10 శాతం వరకు తగ్గుతాయని తెలిపారు. అందువల్ల రోజూ కాఫీని తాగడం మంచిదని వారు సూచిస్తున్నారు.
కోవిడ్ వచ్చిన వారిలో సహజంగానే వాపులు, ఇన్‌ఫెక్షన్ తీవ్రత ఎక్కువగా ఉంటాయి. అయితే కాఫీ తాగే వారిలో ఇన్‌ఫెక్షన్ తీవ్రత, వాపులు తగ్గుతాయని తేల్చారు. అందువల్ల కాఫీని తాగితే కోవిడ్ వచ్చే అవకాశాలను తగ్గించుకోవచ్చని చెబుతున్నారు.
ఇక కాఫీని రోజూ తాగడం వల్ల వృద్ధుల్లో న్యుమోనియా వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయని సైంటిస్టులు చెబుతున్నారు. యూకేలోని బయో బ్యాంక్‌లో 40వేల మంది బ్రిటిష్ వ్యక్తులకు చెందిన వివరాలను విశ్లేషించి సైంటిస్టులు పై విధంగా తెలిపారు. ఇక మాంసాహారం తగ్గించి శాకాహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా కోవిడ్ వచ్చే అవకాశాలు తగ్గుతాయని తెలిపారు.
అయితే కాఫీలు తాగడం, శాకాహారాలను తినడం వల్ల కోవిడ్ రిస్క్‌ను తగ్గించుకోవచ్చు. కానీ వాటిని తీసుకున్నంత మాత్రాన సరిపోదని, కోవిడ్ జాగ్రత్తలను పాటించాల్సిందేనని సైంటిస్టులు చెబుతున్నారు. కాకపోతే ఆ ఆహారాల వల్ల ప్రమాద తీవ్రతను తగ్గించేందుకు అవకాశం ఉంటుందంటున్నారు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365