Weight Loss : ఈ 10 ఆహారాల‌ను తింటే చాలు.. అధిక బ‌రువు నాచుర‌ల్‌గా త‌గ్గుతారు..!

Weight Loss : మ‌న‌లో చాలా మంది అధిక బ‌రువు స‌మస్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా చాలా మంది ఈ స‌మ‌స్య‌ను ఎదుర్కొంటు ఉన్నారు. మారిన మ‌న ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న విధాన‌మే ఈ స‌మ‌స్య‌కు  ప్ర‌ధాన కార‌ణం. అధిక బ‌రువు కార‌ణంగా మ‌నం అనేక ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. గుండెపోటు, షుగ‌ర్, బీపీ, కీళ్ల నొప్పులు, హార్మోన్ల అస‌మ‌తుల్య‌త ఇలా అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. క‌నుక మ‌నం ఈ స‌మ‌స్య నుండి వీలైనంత త్వర‌గా బ‌య‌ట‌ప‌డాలి. లేదంటే కొన్నిసార్లు తీవ్ర అనారోగ్యానికి గురి కావాల్సి వ‌స్తుంది. చాలా మంది బ‌రువు త‌గ్గ‌డానికి అనేక ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. వ్యాయామం, వాకింగ్, డైటింగ్ వంటి ప‌ద్ద‌తుల‌ను పాటిస్తూ  ఉంటారు.

వీటితో పాటు కొన్ని ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను మ‌న రోజూ వారి ఆహారంలో భాగంగా చేర్చుకోవ‌డం వ‌ల్ల కూడా మ‌నం సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. ఈ ఆహార ప‌దార్థాలు మ‌న శ‌రీర బ‌రువును  తగ్గించ‌డంలో ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి. బ‌రువును త‌గ్గించే ఆహార ప‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బ‌రువు త‌గ్గ‌డంలో మ‌న‌కు ప‌సుపు ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తుంది. ప‌సుపును వాడ‌డం వ‌ల్ల శ‌రీరంలో జీవ‌క్రియ‌ల రేటు పెరుగుతుంది. శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వు సుల‌భంగా క‌రుగుతుంది. దీనిని వంట‌ల్లో వాడ‌డంతో పాటు రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున గోరు వెచ్చ‌ని నీటిలో క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. అలాగే నిమ్మ‌కాయ‌ల‌ను వాడ‌డం వ‌ల్ల కూడా మ‌నం సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. వీటిలో విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉండ‌డంతో పాటు కొవ్వును శ‌క్తిగా మార్చ‌డంలో ఇవి ఎంతో దోహ‌ద‌ప‌డ‌తాయి.

take these 10 foods for Weight Loss naturally
Weight Loss

రోజూ ఉద‌యం ప‌ర‌గడుపున వేడి నీటిలో నిమ్మ‌ర‌సాన్ని క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. అలాగే రోజూ గ్రీన్ టీ ని తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మ‌నం సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. గ్రీన్ టీని తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో కొవ్వు వేగంగా క‌రిగిపోతుంది. టీ, కాఫీల‌కు బ‌దులుగా గ్రీన్ టీ తాగ‌డం వ‌ల్ల మ‌నం సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. అదే విధంగా దాల్చిన చెక్క‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మంచి ఫ‌లితం ఉంటుంది. స‌లాడ్ ల‌లో, స్మూతీల‌ల్లో దాల్చిన చెక్క పొడిని చ‌ల్లి తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీర బ‌రువు వేగంగా త‌గ్గుతుంది. అలాగే జీవ‌క్రియ‌ల‌ను మెరుగుప‌రిచి, కొలెస్ట్రాల్ ను క‌రిగించ‌డంలో అల్లం మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. వంట‌లల్లో, సూప్ ల‌ల్లో అల్లాన్ని వేయ‌డం వ‌ల్ల అలాగే అల్లం టీని త‌యారు చేసి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. ఇక బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు తృణ‌ధాన్యాల‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి.

వీటిలో ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుది. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది. పొట్ట నిండుగా ఉంటుంది. త్వ‌ర‌గా ఆక‌లి వేయ‌కుండా ఉంటుంది. దీంతో మ‌నం సుల‌భంగా, ఆరోగ్యంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. అలాగే బాదంప‌పప్పును తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మ‌నం బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. బాదంప‌ప్పును తీసుకోవ‌డం వ‌ల్ల వీటిలో ఉండే ప్రోటీన్, ఫైబ‌ర్ ఆక‌లిని నియంత్రించ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. అలాగే పెరుగును, సొర‌కాయ‌ను, చియా విత్త‌నాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మ‌నం బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. ఈ విధంగా ఈ ఆహారాల‌ను రోజూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల మ‌నం సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. బ‌రువు త‌గ్గ‌డంతో పాటు మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది.

D

Recent Posts