హెల్త్ టిప్స్

చ‌ర్మం సుర‌క్షితంగా, ఆరోగ్యంగా ఉండాలంటే.. వీటిని తీసుకోవాలి..!

మ‌న శ‌రీరంలో ఒక్కో భాగానికి ఒక్కో ర‌క‌మైన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు విట‌మిన్ ఎ ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తింటే కంటి చూపు మెరుగు ప‌డుతుంది. ఇలా ఒక్కో అవ‌య‌వానికి ఒక్కో ర‌క‌మైన ఆహారం కావాలి. అలాగే చ‌ర్మ సంర‌క్ష‌ణ‌కు కూడా అనువైన ఆహారాల‌ను తీసుకోవాలి. దీంతో చ‌ర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా జాగ్ర‌త్త ప‌డవ‌చ్చు. మ‌రి చ‌ర్మ సంర‌క్ష‌ణ‌కు తీసుకోవాల్సిన ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

take these foods daily for healthy skin

1. మ‌న శ‌రీరంలో లివ‌ర్ స‌రిగ్గా ప‌నిచేసేందుకు మెగ్నిషియం ఉప‌యోగ‌ప‌డుతుంది. లివ‌ర్ ఆరోగ్యంగా ఉంటే చ‌ర్మం సుర‌క్షితంగా ఉంటుంది. అందువ‌ల్ల లివ‌ర్‌ను ఆరోగ్యంగా ఉంచే ఆహారాల‌ను తీసుకోవాలి. అందుకు గాను మెగ్నిషియం అధికంగా ఉండే అంజీర్‌, అర‌టి పండ్లు, విత్త‌నాలు, అవ‌కాడో త‌దిత‌ర ఆహారాల‌ను తీసుకోవాలి. దీంతో లివ‌ర్ ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది. చ‌ర్మం సుర‌క్షితంగా, ఆరోగ్యంగా ఉంటుంది. చ‌ర్మ స‌మ‌స్య‌లు పోతాయి.

2. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా మ‌న చ‌ర్మాన్ని సంర‌క్షిస్తాయి. ఇవి ఎక్కువ‌గా ఉండే ఆలివ్ నూనె, అవిసె గింజ‌లు, బాదంప‌ప్పు వంటి వాటిని ఎక్కువ‌గా తీసుకోవాలి. దీంతో చ‌ర్మం ఆరోగ్యంగా ఉంటుంది. చ‌ర్మ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

3. విట‌మిన్ సి అధికంగా ఉండే ఆహారాల‌ను తీసుకుంటున్నా చ‌ర్మం ఆరోగ్యంగా ఉంటుంది. విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉండే నిమ్మ‌, నారింజ‌, కివీ, క్యాప్సికం, ప‌చ్చి బ‌ఠానీ, స్ట్రాబెర్రీ వంటి ఆహారాల‌ను త‌ర‌చూ తీసుకోవాలి. దీంతో చ‌ర్మం సుర‌క్షితంగా ఉంటుంది.

4. చేప‌ల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల చేప‌ల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగం చేసుకోవాలి. దీంతో చ‌ర్మాన్ని సుర‌క్షితంగా ఉంచుకోవ‌చ్చు.

5. వాల్ న‌ట్స్‌లో ఒమెగా 3, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు, విట‌మిన్ ఇ ఉంటాయి. ఇవి చ‌ర్మాన్ని సంర‌క్షిస్తాయి.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts